Committee Kurrollu: మెగా డాటర్ నిహారిక తొలి నాళ్ళలోనే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా దూసుకెళ్తోంది. చిన్న పెద్ద అని సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ మంచి ప్రొడ్యూసర్ గా ప్రూవ్ చేసుకుంటోంది. ఇప్పటికే తన పింక్ ఎలిఫాంట్ బ్యానర్ లో ‘హలో వరల్డ్’ వంటి వెబ్ సీరీస్ తో సూపర్ హిట్ అందుకున్న నిహారిక.. తాజాగా మరో విలేజ్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను మెప్పించింది.
”కమిటీ కుర్రాళ్ళు”
నిహారిక నిర్మాణంలో యదు వంశీ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ”కమిటీ కుర్రాళ్ళు”. ఆగస్టు 9న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. రూరల్ లైఫ్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వసూళ్ళను రాబట్టింది. సుమారు రూ.5 కోట్ల లోపు బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా.. దాదాపు రూ.17కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకున్నట్లు సమాచారం. దీంతో నిర్మాతగా నిహారిక మంచి సక్సెస్ అందుకుంది.
కమిటీ కుర్రాళ్ళు ఓటీటీ రిలీజ్
ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినీ ప్రియులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కమిటీ కుర్రాళ్ళు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 12 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గోదావరిలోని ఓ గ్రామంలో ఉండే స్నేహితులు, వారి జీవితాలు, ఆ ఊరిలోని పరిస్థితుల చుట్టూ తిరిగే కథే కమిటీ కుర్రాళ్ళు.
Telugu film #CommitteeKurrollu (2024) premieres Sept 12th on @etvwin.@IamNiharikaK @PinkElephant_P @SRDSTUDIOS_ @yadhuvamsi92 @eduroluraju @anudeepdev @anwaraliedit @manyam73 @urs_jdmaster @tseriessouth pic.twitter.com/zNNzEbWS1C
— CinemaRare (@CinemaRareIN) September 5, 2024
యదు వంశీ తెరకెక్కించిన ఈ చిత్రంలో మొత్తం 11 మంది లీడ్ యాక్టర్స్ గా నటించారు. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్, శ్యామ్ కల్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్టా, తేజస్వి రావ్ ముఖ్య పాత్రలను పోషించారు.
Also Read: Committee Kurrollu: బాక్సాఫీస్ వద్ద ‘కమిటీ కుర్రాళ్ళ’ కలెక్షన్ల జోరు..! – Rtvlive.com