/rtv/media/media_files/2026/02/13/ram-charan-son-name-2026-02-13-15-13-15.jpg)
ram charan son name
Ram charan Son: మెగా కపుల్ రామ్ చరణ్- ఉపాసన దంపతుల ట్విన్ బేబీస్ నామకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. మెగాస్టార్ దంపతులు- ఉపాసన తల్లిదండ్రుల సమక్షంలో తమ పిల్లలకు పేర్లు పెట్టారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన మనవడు, మనవరాలి పేర్లను సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. బాబుకు శివ రామ్ అని నామకరణం చేయగా, పాపకు అన్విరా దేవి అని పేరు పెట్టినట్లు తెలిపారు.
సీక్రెట్ ఇదే
అయితే మెగాస్టార్ తన వారసుడికి తన పేరు అలాగే కొడుకు రామ్ చరణ్ పేరు కలిసి వచ్చేలా నామకరణం చేశారు. చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్ నుంచి 'శివ', రామ్ చరణ్ పేరు నుంచి 'రామ్' తీసుకొని 'శివరామ్' అని పెట్టినట్లు తెలిపారు. ఇది మాత్రమే కాదు 'శివరామ్' అంటే అంతర్గత శక్తి, ధర్మానికి ప్రతీక. అలాగే అమ్మాయికి కనకదుర్గమ్మ ఆశీస్సులతో, ధైర్యం, దైవిక రక్షణను సూచించేలా అన్విరా దేవి అని నామకరణ చేసినట్లు తెలిపారు. తమ కొత్త కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న ఈ చిన్నారులకు అందరి ఆశీస్సులు కావాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు.
With boundless joy and divine grace ✨🙏🏻
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 13, 2026
We are delighted to announce the beautiful names of our two little blessings ❤️
"𝑺𝒉𝒊𝒗𝒂 𝑹𝒂𝒎 𝑲𝒐𝒏𝒊𝒅𝒆𝒍𝒂" & "𝑨𝒏𝒗𝒆𝒆𝒓𝒂 𝑫𝒆𝒗𝒊 𝑲𝒐𝒏𝒊𝒅𝒆𝒍𝒂"
✨Shiva Ram is a profound confluence of two eternal ideals.
“Shiva” is… pic.twitter.com/Z2L0177cCa
గతనెల జనవరి 31న రామ్ చరణ్- ఉపాసన దంపతులు తమ కవల పిల్లలకు జన్మనిచ్చారు. వారసుడి రాకతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులంతా కూడా సంబరాలు చేసుకున్నారు. రామ్ చరణ్, చిరంజీవి ప్లకార్డులతో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేశారు. ఇదిలా ఉంటే రామ్- ఉపాసన దంపతులకు మొదటి సంతానంగా క్లింకార పుట్టింది. ప్రస్తుతం క్లింకార వయసు రెండేళ్లు.
Also Read: Funky Review: ఫంకీ ఫస్ట్ డే రివ్యూ.. ఈసారైనా 'మాస్ కా దాస్' హిట్ కొట్టాడా..?
Follow Us