/rtv/media/media_files/2025/12/22/bigg-boss-winner-kalyan-2025-12-22-13-30-23.jpg)
bigg boss winner kalyan
Bigg Boss 9 Winner: అప్పుడు జై కిసాన్.. ఇప్పుడు జై జవాన్.. ఆర్మీ ఉద్యోగం చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ లో అడుగుపెట్టాలనే తన కలను నెరవేర్చుకున్నారు. కేవలం అడుగుపెట్టడంతోనే ఆగిపోకుండా.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేతగా నిలిచి సంచలనం సృష్టించాడు.. ఆర్మీ జవాన్ కళ్యాణ్ పడాల. గత సీజన్ లో సామాన్యుడిగా వచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ట్రోఫీ గెలవగా.. ఈసారి జవాన్ కి ఆ విజయం దక్కింది. ఒక సాధారణ మధ్యతరగతి అబ్బాయి నుంచి బిగ్ బాస్ విజేతగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాడు కళ్యాణ్.
మొత్తం ఎంత
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా కళ్యాణ్ ప్రైజ్ మనీ ఎంత? పది హేను వారాలకు రెమ్యునరేషన్ ఎంత సంపాదించాడు? ప్రైజ్ మనీతో పాటు కళ్యాణ్ గెలుచుకున్న బెనిఫిట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకోండి.. అయితే వారానికి రూ. 70వేల రెమ్యునరేషన్ చొప్పున.. పదిహేను వారాలకుగానూ కళ్యాణ్ రూ.10.50 లక్షలు సంపాదించాడు. ఇది కాకుండా ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు కాగా, డెమోన్ పవన్ రూ. 15 లక్షల సూట్ కేసుతో బయటకు రావడంతో.. కళ్యాణ్ కి రూ. 35 లక్షలు మాత్రమే దక్కాయి.
ప్రైజ్ మనీతో పాటు
ప్రైజ్ మనీతో పాటు రాఫ్ టైల్స్ స్పాన్సర్స్ మరో రూ.5 లక్షల చెక్కును కళ్యాణ్ కు గిఫ్ట్ గా ఇచ్చారు. అలాగే మారుతి సుజుకికి చెందిన విక్టోరిస్ కారు కూడా సొంతం చేసుకున్నాడు. దీని ధర రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉంటుంది. అలా మొత్తంగా కళ్యాణ్ బిగ్ బాస్ నుంచి రూ.50-60 లక్షలకుపైగా సంపాదించాడు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/12/22/kalyan-padala-pic-2025-12-22-13-27-14.png)
కళ్యాణ్ జర్నీ..
కళ్యాణ్ పడాల ఒక సెలబ్రిటీగా కాకుండా 'సామాన్యుడి' కోటాలో హౌస్‌లోకి వచ్చారు. 'అగ్నిపరీక్ష' వేలమందిని దాటుకొని బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టాడు. అయితే మొదటి రెండు వారాలు హౌజ్ కళ్యాణ్ ఆట ఏమీ కనిపించలేదు. ఎవరైనా ఏడిస్తే ఓదార్చడం, లేదా సైలెంట్ గా కూర్చోవడమే తన పని అన్నట్లుగా ఉండేది. దీంతో పక్కా మూడు లేదా నాలుగో వారమే ఎలిమినేట్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ, అందరి అంచనాలను తారుమారు చేస్తూ గట్టిగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. హోస్ట్ నాగార్జున నీ ఓదార్పు యాత్రలు తప్పా.. ఆట కనిపించడంలేదు, ఇలాగే ఉంటే నీ ఆట ముగిసిపోతుంది అంటూ గడ్డి పెట్టడంతో తేరుకున్నాడు. అప్పటి నుంచి ఆటలో అలెర్ట్ అయ్యాడు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/12/22/kalyan-padala-photo-2025-12-22-13-27-14.png)
కమ్ బ్యాక్
నాలుగో వారం నుంచి కళ్యాణ్ అసలు ఆట మొదలైంది. ముఖ్యంగా తన స్నేహితురాలు ప్రియ ఎలిమినేట్ అయిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చింది. ఆటలో దూకుడు పెంచి, ప్రతి ఫిజికల్ టాస్క్‌లో తన సత్తా చాటారు. తాను ఒక జవాన్ కావడంతో, హౌస్‌లో చాలా క్రమశిక్షణతో ఉండేవాడు. ఓ వైపు గేమ్ ఆడుతూనే, మరోవైపు అవసరమైనప్పుడు తన స్నేహితుల కోసం నిలబడడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోల్జర్ అనే ఇమేజ్‌కు తగ్గట్టుగా చాలా నిజాయితీగా ఆడటం అందరినీ మెప్పించింది. రెండు బిగ్ బాస్ హౌజ్ కెప్టెన్ గా, మొదటి ఫైనలిస్ట్ గా తన గ్రాఫ్ అమాంతం పెంచుకున్నాడు. అదే ఊపుతో బిగ్ బాస్ 9 ట్రోఫీని ఎత్తాడు.
Also Read: Rajasaab Songs: 'రాజాసాబ్'కు తమన్ న్యాయం చేయలేకపోతున్నాడా..? ఇక ఆశలన్నీ దానిపైనే..!
Follow Us