తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ పరీక్షలు జరగనున్నాయని పేర్కొంది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
పాలస్తీనా ప్రధాని మొహమ్మద్ శతాయే తన పదవికి రాజీనామా చేశారు. గాజాతో పాటు వెస్ట్ బ్యాంకులో హింసాత్మక ఘటనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌కు రాజీనామా లేఖను సమర్పించారు.
మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సుకు ఆందోళనకారులు నిప్పంటించడం కలకలం రేపింది. అంతర్వాలి సారథి గ్రామంలో ఆందోళన చేస్తున్న మరాఠా కోటా ఉద్యమనేత మనోజ్ జరంగే.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇంటికి ర్యాలీగా వెళ్తానని ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తెలంగాణలో 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై మార్చి 31లోగా దరఖాస్తుదారులకు లే-అవుట్‌ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్‌లను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుంది.
సింధూ నది ఉపనది రావి నది జలాలు భారత్‌కు దక్కనున్నాయి. దాదాపు 45 ఏళ్ల తర్వాత రావి నదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తికావడంతో పాకిస్థాన్‌కు నీటి ప్రవాహన్ని భారత్ పూర్తిగా ఆపేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో 32 వేల హెక్టార్లలో సాగుకు నీరు అందనుంది.
ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బార్లపల్లె వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై.. లారీ, కారు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఎదురుగా వచ్చిన కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈనెల 26న విచారణకు హాజరుకాలేనని కవిత సీబీఐకి లేఖ రాయడంతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒప్పందంలో భాగంగానే కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. కాంగ్రెస్ ఓట్లు చీల్చాలనేదే వాళ్ల ఆలోచన అంటూ మండిపడ్డారు.
తెలంగాణలో ఖాళీ అయిన నామినేటేడ్ పోస్టులను కాంగ్రెస్ సర్కార్ భర్తీ చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్ కే.శ్రీనివాస్ రెడ్డిని నియమించింది రేవంత్ సర్కార్. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.