Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు షాక్.. ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు కోర్టు తాజాగా ఆరు రోజులు పోలీస్ కస్టడీ విధించింది. By B Aravind 31 May 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. అశ్లీల వీడియో కేసుపై విచారణ జరిపిన ప్రజాప్రతినిధల కోర్టు ఆయనకు ఆరు రోజులు పోలీస్ కస్టడీ విధించింది. ఇదిలాఉండగా.. మైసూర్‌లోని కేఆర్ నగర్‌కు చెందిన మహిళ కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు వాళ్లకు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ కూడా కోర్టులో పిటిషన్ వేసింది. విచారణ ముగిసేవరకు రేవణ్ణ పోలీస్ కస్టడీలోనే ఉండాలని.. అందుకే బెయిల్ రద్దు చేయాలంటూ సిట్ కోరింది. దీనిపై విచారణను హైకోర్టు జూన్ 3కి వాయిదా వేసింది. Also Read: దేశభక్తి పాటకు ప్రదర్శన ఇస్తూ కుప్పకూలిన జవాన్.. చివరికి ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక దాడులు చేసినట్లు వీడియోలు బయటపడటంతో ఆయన విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఆయన తాతా, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడె కూడా రేవణ్ణను ఇండియాకు వచ్చి లొంగిపోవాలంటూ ఎక్స్ వేదికగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ నుంచి బయలుదేరి.. గురువారం అర్ధరాత్రి బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగారు. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు ఆయన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సీఐడీ కార్యాలయానికి తరలించారు. శుక్రవారం ఉదయం వైద్యపరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రజ్వల్‌ను కోర్టుకు తరలించారు. దీంతో ప్రజ్వల్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిట్.. కోర్టును కోరింది. ఈ క్రమంలోనే న్యాయస్థానం ఆయనకు ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అనమతించింది. Also read: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలి: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ #police-custody #prajawal-revanna #prajwal-revanna-custody మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి