Exit Polls: ఎగ్జిట్ పోల్స్‌పై ఉత్కంఠ.. 2019 ఎన్నికల ఫలితాల అంచనాలు ఇవే! జూన్ 1న జరగబోయే లోక్‌సభ తుది ఎన్నికల తర్వాత అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై వెళ్లనుంది.ఇప్పటికే దేశవ్యాప్తంగా అందరూ ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, అలాగే అధికారిక ఫలితాలు ఎలా వచ్చాయో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 31 May 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి 2019 Exit Polls: లోక్‌సభ ఏడో దశ ఎన్నికలు రేపు అంటే.. జూన్ 1న జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో లోక్‌సభ ఎన్నికలకు తెరపడనుంది. ఈ తుది ఎన్నికల తర్వాత.. అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అందరూ ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్‌ను వివిధ ప్రైవేటు సంస్థలు, అలాగే పలు మీడియా సంస్థలు నిర్వహిస్తాయి. పోలింగ్ బూత్‌లో ఓటేసిన తర్వాత ఓటరు అభిప్రాయాన్ని తెలుసుకుని ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంచనా వేసి ఓ రిపోర్టును తయారు చేస్తాయి. ఎన్నికలు పూర్తిగా అయిపోయిన తర్వాత అదే రోజున సాయంత్రం ఈ సంస్థలు తాము సేకరించిన ఎగ్జిట్ పోల్స్ వివరాలను విడుదల చేస్తాయి. Also Read: గుడ్‌న్యూస్.. అంచనాకు మించి జీడీపీ వృద్ధి రేటు సాధించిన భారత్ ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి అధికారిక ఎన్నికల ఫలితాలకు దాదాపు దగ్గరగానే ఉంటాయన్న భావన సాధారణంగా ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్‌ను చూసి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనాకు రావొచ్చన్న భావన ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ సరైన ఫలితాలు ఇస్తాయని అనుకోవడం కూడా పొరపాటే. కొన్నిసార్లు వీటి లెక్క కూడా తప్పి అంతా తారుమారు అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే 2019లో మే 19న లోక్‌సభ ఎన్నికలు ముగిశాక వివిధ సంస్థలు తాము సేకరించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేశాయి. ఆ సమయంలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? అవి ఎంత మేరకు నిజం అయ్యాయి అన్న వివరాలను ఓ సారి చూద్దాం.. Also Read: కన్యాకుమారి పేరు వెనుక ఉన్న కథేంటి..అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా! 2019లో ఎగ్జిట్ పోల్స్ ప్రభావం 2019లో మే 19న లోక్‌సభ ఎన్నికలు ముగిశాక వివిధ సంస్థలు తాము సేకరించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేశాయి. అసలు ఫలితాలు ఎలా వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ ఎలా అంచా వేశాయే ఇక్కడ చూడండి. ఇందులో సీఓటర్, ఇండియా న్యూస్, ఏబీపీ-సీఎస్డీఎస్ సంస్థలు తప్పా మిగతా అన్ని సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ దాదాపు నిజం అయ్యాయనే చెప్పొచ్చు. #national-news #telugu-news #exit-polls #lok-sabha-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి