Spelling Bee: 'స్పెల్లింగ్ బీ' పోటీల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థి.. అమెరికాలో ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ 'స్పెల్లింగ్ బీ' పోటీల్లో భారత సంతతి విద్యార్థి బృహత్ సోమ సత్తా చాటాడు. కేవలం 90 సెకండ్లలోనే 29 పదాలను తప్పుల్లేకుండా చెప్పి టైటిల్ గెలుచుకున్నాడు. బృహత్ వాళ్ల నాన్న నల్గొండ జిల్లా వాసి. By B Aravind 31 May 2024 in ఇంటర్నేషనల్ తెలంగాణ New Update షేర్ చేయండి అమెరికాలో ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ 'స్పెల్లింగ్ బీ' పోటీల్లో ఈసారి కూడా భారత సంతతి విద్యార్థుల హవా కొనసాగింది. ఈ ఏడాది జరిగిన 96వ స్కిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో.. భారత సంతతి విద్యార్థి బృహత్ సోమ సత్తా చాటాడు. ఏడుగురు ఫైనలిస్టులను ఓడించి విజయం సాధించాడు. కేవలం 90 సెకండ్లలోనే 29 పదాలను తప్పుల్లేకుండా చెప్పి టైటిల్ గెలుచుకున్నాడు. అలాగే 50 వేల డారల్ల నగదు బహుతమి కూడా అందుకున్నాడు. Also Read: రేపే ఎగ్జిట్ పోల్స్.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇక వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల బృహత్ సోమ.. ప్రస్తుతం ఏడో క్లాస్ చదువతున్నాడు. అతని తండ్రి శ్రీనివాస్ సోమ నల్గొండ జిల్లా వాసి. ఈసారి జరిగిన స్పెల్లింగ్ బీ పోటీల్లో దాదాపు 240 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. అందులో ఏడుగురు ఫైనల్స్‌కు చేరుకున్నారు. వాళ్లలో బృహత్ సోమకి, టెక్సాస్‌కు చెందిన పైజాన్ జాకీకి మధ్య జరిగిన పోటిలో టై ఏర్పడింది. దీంతో ఈవెంట్ నిర్వాహకులు వీళ్లిద్దరికీ మరో రౌండ్‌లో కేవలం 90 సెకండ్ల సమయాన్ని కేటాయించారు. ఇందులో పైజాన్ జాకీ 90 సెకండ్లలో 20 పదాలు చెప్పగా.. బృహత్ ఏకంగా 29 పదాలు తప్పులు లేకుండా చెప్పి విజయం సాధించాడు. అయితే 2022లో జరిగిన స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన హరిణి లోగాన్ 90 సెకండ్లలో 22 పదాల స్పెల్లింగ్ చెప్పగా.. ఆ రికార్డును ఈసారి బృహాత్ బ్రేక్ చేశాడు. 2022లో కూడా బృహత్ ఈ పోటిలో 163 స్థానానికి చేరుకోగా, 2023లో 74 స్థానంలో నిలిచాడు. ఈసారి మాత్రం ఏకంగా టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ పోటీలో రన్నరప్‌గా నిలిచిన జాకీకి 25 వేల డాలర్ల ప్రైజ్‌మనీ అందజేశారు. ఇదిలాఉండగా.. 1925 నుంచి అమెరికా ఈ స్పెల్లింగ్ బీ పోటీలు నిర్వహిస్తూ వస్తుంది. ఇప్పటివరకు జరిగిన పోటీల్లో మొత్తం 29 మంది భారత సంతతి విద్యార్థులు టైటిల్స్ గెలుచుకున్నారు. Also Read: దోషిగా తేలిన ట్రంప్.. జైలుకెళ్తారా ? #usa #telugu-news #spelling-bee మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి