Israel-Gaza: పాలస్తీనియన్లకు షాక్.. వీసాలు తిరస్కరిస్తున్న ఆస్ట్రేలియా ఇజ్రాయెల్-గాజా మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. 10,033 మంది పాలస్తీనియన్లు ఆస్ట్రేలియా వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో కేవలం 2,922 మాత్రమే ఆమోదం పొందగా మిగతా 7,111 వీసాలు తిరస్కరణకు గురయ్యాయి. ఇజ్రాయెల్ పౌరులకు మాత్రం ఎక్కువగా వీసాలు వస్తున్నాయి. By B Aravind 16 Aug 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వేలాదిమంది పాలస్తీనీయులు మృతి చెందారు. మరికొందరు శరణార్థులుగా పునరావాసం కోసం పలు దేశాలకు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఆస్ట్రేలియాకు చేసుకున్న వీసా దరఖాస్తులు ఎక్కువగా రిజెక్ట్ అవుతున్నాయని పలు నివేదికలు వెల్లడించాయి. ఇప్పటిదాకా 10 వేల మంది పాలస్తీనియన్ పౌరులు ఆస్ట్రేలియా వీసాకు దరఖాస్తు చేసుకున్నట్లు ఆ దేశ హోంశాఖ మంత్రి టోనీ బుర్కో తెలిపారు. Also Read: పశ్చిమాసియాలో యుద్ధం!.. ఇరాన్‌కు సాయం చేస్తోన్న తుర్కియే ఇక వివరాల్లోకి వెళ్తే.. మొత్తం 10,033 మంది పాలస్తీనియన్లు, 8,881 మంది ఇజ్రాయెల్ పౌరులు ఆస్ట్రేలియా వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీటిలో కేవలం 2,922 వీసాలు మాత్రమే ఆమోదం పొందాయి. మిగతా 7,111 వీసాలు తిరస్కరణకు గురయ్యాయి. మరోవైపు ఇజ్రాయెల్ పౌరుల వీసాల్లో 235 రిజెక్ట్ అయ్యాయి. మిగతా 8,646 ఆమోదం పొందాయి. గాజా నుంచి వచ్చే వీసా దరఖాస్తుల మూల్యాంకనాన్ని కఠినతరం చేయాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది. అందుకే పాలస్తీనియన్లు వీసా దరఖాస్తులు ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయి. పాలస్తీనియన్ల ప్రవేశం జాతీయ భద్రతకు ముప్పుగా ఉంటుందని ఇటీవల ఆస్ట్రేలియా విపక్ష నేత పిటర్ డటన్.. ఆస్ట్రేలియా సంకీర్ణ పార్లమెంట్ సభ్యులు నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు. Also Read: తైవాన్‌లో భారీ భూకంపం.. భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీసిన ప్రజలు! #telugu #israel #iran #gaza మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి