Tornado : విధ్వంసం సృష్టించిన సుడిగాలులు.. ఆరుగురు మృతి

అమెరికాలో టెన్నసీ రాష్ట్రంలో శనివారం సుడిగాలులు విధ్వంసం సృష్టించడంతో ఆరుగురు మృతి చెందారు. మరో 23 మంది గాయాలపాలయ్యారు. ప్రస్తుతం క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. టెన్నసీ నగరాన్ని మరిన్ని సుడిగాలులు తాకొచ్చని వాతావరణ సర్వీసు హెచ్చరించింది.

New Update
Tornado : విధ్వంసం సృష్టించిన సుడిగాలులు.. ఆరుగురు మృతి

Tennessee State : అమెరికా(America) లో టెన్నసి(Tennessee) రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. అక్కడ శనివారం సుడిగాలులు విధ్వంసం సృష్టించాయి. వీటి ప్రభావానికి ఏకంగా ఆరుగురు మృతి చెందడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో మరో 23 మంది గాయాలపాలయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే సుడిగాలుల బీభత్సవానికి టెన్నసీ నగరంలో ఇళ్లు కూడా ధ్వంసం అయ్యాయి. అలాగే శనివారం రాత్రంతా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఆ రోజున మధ్యాహ్నం రెండు గంటలకు ఒక్కసారిగా సుడిగాలులు నగరాన్ని తాకాయి. అయితే టెన్నసీ నగరాన్ని మరికొన్ని సుడిగాలులు కూడా తాకే అవకాశాలు ఉన్నాయని జాతీయ వాతావరణ సర్వీసు హెచ్చరించింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకా.. అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Also Read: అన్నా అని పిలిచింది..నేనున్నా అంటూ ఆపన్న హస్తం ఇచ్చిన రేవంత్

Advertisment
తాజా కథనాలు