AstraZeneca Withdraws Covid Vaccine : కరోనా బారి నుంచి జనాలను రక్షించేందుకు అన్ని పెద్ద దేశాలు అప్పటి కప్పుడు వ్యాక్సిలను తయారు చేశాయి. మొదటి వేవ్‌లో తగిలిన దెబ్బలకు రెండో వేవ్ సమయానికి వ్యాక్సిలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. అమెరికా, భారత్, బ్రిటన్ ఇలా చాలా దేశాలు వ్యాక్సిన్‌సు అప్పటికప్పుడు తయారు చేశాయి. బ్రిటన్ ఫార్మా కంపెనీ అస్ట్రాజెనికా కూడా కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసి అన్ని దేశాలకూ స్లై చేసింది. అయితే అప్పుడు ఈ టీకా వలన కరోనా నుంచి తప్పించుకోగలిగారు కానీ...తరువాత దీని ప్రభావం వల్ల చాలా మంది బ్లడ్ క్లాట్స్ (Blood Clot) బారిన పడుతున్నారు. అస్ట్రాజెనికా వ్యాక్సిన్ కారణంగా బ్లాట్ క్లాట్స్, తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్‌కు దారితీసే అవకాశం ఉందని స్వయంగా వ్యాక్సిన్ తయారీదారే ఒప్పుకుంది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ (Covishield Vaccine), సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాచే ఉత్పత్తి చేసింది. దీనిని మన దేశం మొత్తం ఉపయోగించింది. అయితే కోవిషీల్డ్ వల్ల జనాలు థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ అనే సిండ్రోమ్‌కు గురవుతున్నారు. దీని కారణంగా శరీరంలో రక్తం గడ్డ కట్టడం లేదా ప్లేట్‌లెట్స్ కౌంట్ వేగంగా పడిపోవడం జరుగుతోంది. శరీరంలో రక్తం గడ్డకట్టడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ లేదా కార్డియాక్ అరెస్ట్ అవుతోందని నిరూపితమయింది.
చాలా కేసులు నమోదు..
ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తమకు నష్టం కలిగించింది యూకేలో దాదాపు 51 మంది బాధితులు అక్కడి హైకోర్టులో పిటిషన్ వేశారు. తమకు 100 మిలియన్ పౌండ్ల నష్టపరిహారం ఇప్పించాలని వారు అందులో కోరారు. మొట్టమొదటిసారిగా జామీ స్కాట్ అనే బ్రిటీష్ వ్యక్తి ఆస్ట్రాజెనెకాపై కేసు పెట్టాడు. జామీ స్కాట్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ సమస్యతో బాధపడుతున్నారు. అతని తర్వాత కూడా చాలా మంది ఈ వ్యాక్సిన్ మీద కేసులు వేయడం మొదలుపెట్టారు. మొదట్లో వీటిన్నింటినీ కంపెనీ వ్యతిరేకించింది కానీ ఈ ఏడా మొదట్లో మాత్రం ఈ కోవిషీల్డ్ వ్యాక్సిస్ వల్ల దుష్ప్రభావాలు వస్తున్నాయని అంగీకరించింది. ఒక్క యూకేలోనే ఈ వ్యాక్సిన్ కారణంగా 81 మంది చనిపోయారు.
ఉపసంహరణ...
తాము తయారు చేసిన కోవిషీల్డ్, వాక్స్‌జెర్వియా వ్యాక్సిన్‌లతో కోలుకోలేని సమస్యలు వస్తున్నాయని ఆస్ట్రాజెనెకానే ఒప్పుకుంది. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దీనిని ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఐరోపా దేశాల్లో టీకాను వెనక్కు తీసుకునేందుకు మార్చి 5వ తేదీన సంస్థ దరఖాస్తు చేసుకోగా.. మంగళవారం నాటి నుంచి ఈ ఉపసంహరణ అమల్లోకి వచ్చింది ఆస్ట్రాజెనెకా పేర్కొనింది. బ్రిటన్ సహా, ఇతర దేశాల్లోనూ త్వరలో టీకా ఉపసంహరణ దరఖాస్తులను కంపెనీ దాఖలు చేసుకుంది. అయితే ఆస్ట్రాజెనెకా వలన ఇప్పుడు వందలలో మరనాలు సంభవిస్తున్న మాట నిజమే అయినా కరోనా టైమ్‌లో మాత్రం దాదాపు 65 లక్షల మంది ప్రాణాలను కాపాడింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీ 100 కోట్ల టీకాలను సప్లై చేసింది.
Also Read:IPL 2024: హైదరాబాద్‌లో ఈరోజు ఐపీఎల్ మ్యాచ్..జరుగుతుందా?