Asaduddin Owaisi : పోలీసులు 15 నిమిషాలు పక్కకు జరిగితే తామేం చేయగలమో చూపిస్తామని 2013లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ(BJP) నేత నవనీత్ కౌర్(Navaneet Kaur) చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్‌లో(Telangana Politics) మరోసారి దుమారం రేపుతున్నాయి. నవనీత్ కౌర్‌గా తెలుగు ప్రజలకు పరిచయమైన లీడర్ నవనీత్ రాణా. తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసి మహారాష్ట్ర రాజకీయ నేతను పెళ్లి చేసుకున్నారు. తర్వాత తాను రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా అమరావతి ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. బీజేపీ తరపున ప్రచారం చేయడానికి తెలంగాణకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మాకైతే 15 సెకన్లు చాలు..
'15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే మేమేంటో చూపిస్తామని చిన్నోడు (అక్బరుద్దీన్) చెబుతున్నాడు. చిన్నోడికి నేను చెబుతున్నా 15 నిమిషాలు ఎందుకు.. మాకైతే 15 సెకన్లు చాలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో.. ఎక్కడికి వెళ్లిపోతారో మీకే తెలియదు. మాధవీలత హైదరాబాద్‌ను మరో పాకిస్థాన్ కాకుండా కాపాడగలరు' అని నవనీత్ కౌర్ అన్నారు. అయితే నవనీత్ కౌర్ మాటలకు ఏఐఎంఐం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. గురువారం ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. 15 సెకన్లు కాదు గంట సమయం తీసుకోండి.. ముస్లింలను ఏం చేస్తారో చేయండని సవాల్ విసిరారు. అప్పుడు మీలో ఎంత మానవత్వం మిగిలి ఉందో తెలుసుకోవాలనుకుంటున్నామన్నారు. ఎవరు భయపడేవాళ్లు ఉన్నారు? మేం సిద్ధంగానే ఉన్నామని వ్యాఖ్యానించారు. అధికారమంతా మీ దగ్గరే ఉంది.. ప్రధాని మీవారు... ప్రభుత్వం మీది... ఆరెస్సెస్ మీది... ఎవరు ఆపుతున్నారు... ఎక్కడికి రమ్మంటే తాము అక్కడికి వస్తామన్నారు. మాటలెందుకు చేసి చూపించండి.. తాము ఇక్కడే ఉన్నాం కదా అని అసద్ సీరియస్ అయ్యారు. దీంతో బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల దుమారం రేపుతోంది. కాగా.. నవనీత్ కౌర్ ప్రకటనపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఎంఐఎం డిమాండ్ చేసింది.
ఇది కూడా చదవండి: Bhainsa: కేటీఆర్‌పై దాడి.. టమాటాలు, ఉల్లిగడ్డలు విసిరిన దుండగులు!
ఎన్నికల సంఘం(Election Commission) నిబంధనలను ఉల్లంఘించేలా బీజేపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, నవనీత్ రాణా ఈ ప్రకటనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని పార్టీ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ అన్నారు. కాగా.. 2012లో అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన చేశారు. 15 నిమిషాల పాటు పోలీసులను తొలగించండి, ఎవరికి ఎంత అధికారం ఉందో చెబుతామని ఓవైసీ అన్నారు. అయితే ఈ కేసులో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. 15 నిమిషాల్లో పోలీసులను తొలగించాలని అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత స్వయంగా లొంగిపోయి జైలుకు వెళ్లారు. తర్వాత బెయిల్ వచ్చింది. అయితే ఇన్నాళ్లు కోర్టులో తన ప్రసంగం మీద పోరాడి నిర్దోషిగా విడుదలైన విషయం తెలిసిందే.