BRS : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) గురువారం నిర్మల్ జిల్లా బైంసాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం(Election Campaign)లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణంలోని పాత చెక్‌పోస్ట్ కార్యాలయం కూడలి వద్ద కార్నర్ మీటింగ్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. ఆ సమయంలో కొందరు కేటీఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఆయన వాహనం వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని నిలువరించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పూర్తిగా చదవండి..Bhainsa : కేటీఆర్‌పై దాడి.. టమాటాలు, ఉల్లిగడ్డలు విసిరిన దుండగులు!
భైంసాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయనకు వ్యతిరేకంగా ప్లకార్డులతో పలువురు నిరసన వ్యక్తం చేశారు. జన సమూహంలో నుంచి కొందరు విసిరిన ఉల్లిగడ్డలు, టమాటాలు ప్రచార వాహనం సమీపంలో పడగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
Translate this News: