ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ చేసిన విజ్ఞప్తికి ఢిల్లీ హైకోర్టు శనివారం అంగీకారం తెలిపింది. ఈ మేరకు 14 రోజుల పాటు సీబీఐ జ్యుడిషియల్ కస్టడీకి పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సమయంలో కేజ్రీవాల్ సరిగా సహకరించలేదని.. రిమాండ్ రిపోర్డులో సీబీఐ కోర్టుకు తెలియజేసింది. నేరం నుంచి తప్పించుకునేందుకు కేజ్రీవాల్ సాక్ష్యాలకు విరుద్ధంగా సమాధానాలు ఇచ్చారని.. ఇంకా కొన్నింటికి అసలు సమాధానమే చెప్పలేదని వెల్లడించింది. ఇదంతా ఆయన ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని.. అందుకే తమకు మరికొన్ని రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరింది
Also Read: హైదరాబాద్‌కు సమానంగా వరంగల్ అభివృద్ధి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
చివరికి సీబీఐ అభ్యర్థనను పరిశీలించిన ఢిల్లీ కోర్టు.. కేజ్రీవాల్‌కు జులై 12 వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఆరోజున ఆయన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ అధికారులు ఆయన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచనున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా.. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ.. ఈడీ పిటిషన్‌తో హైకోర్టు బెయిల్‌ను నిలిపివేసింది. దీంతో ఆయన్ని సీబీఐ అరెస్టు చేసింది.
Also read: మరో స్టాండప్ కమెడియన్‌ని టార్గెట్ చేసిన రాజాసింగ్..