TG - AP : తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి ముహుర్తం ఖరారు .. ఆ అంశాలపైనే చర్చ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీకి ముహుర్తం ఖరారైంది. శనివారం సాయంత్రం 6 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాభవన్‌లో కలవనున్నారు. షెడ్యూల్ 9, 10లో ఉన్న విభజన అంశాలపైనే ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

New Update
TG - AP : తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి ముహుర్తం ఖరారు .. ఆ అంశాలపైనే చర్చ

Chandrababu - Revanth Meeting : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం భేటీ కానున్న సంగతి తెలిసిందే. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్‌ (Praja Bhavan) లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కలవనున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఇలా ముఖ్యమంత్రులు ఒకేచోట కలిసి భేటీ అవ్వడం ఇదే మొదటిసారి కానుంది. ముఖ్యంగా షెడ్యూల్ 9, 10లో ఉన్న విభజన అంశాలపైనే ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: తెలంగాణలో ‘నిరుద్యోగుల మార్చ్‌’.. బర్రెలక్క అరెస్ట్!

విద్యుత్‌ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న బకాయిల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు రూ.24 వేల కోట్లు ఏపీ ప్రభుత్వం తమకు చెల్లించాల్సి ఉందని తెలంగాణ సర్కార్ చెబుతోంది. కానీ ఏపీ మాత్రం తెలంగాణకు కేవలం రూ.7 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని వాదిస్తోంది. ఇంకా పలు సంస్థల్లో తమకు వాటా కావాలని ఏపీ సర్కార్ అడుగుతోంది. ఇంకా ఇలా చాలా సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్‌ ప్రత్యేక దృష్టి సారించారు.

అయితే మార్చి నెలలో సీఎం రేవంత్ చొరవతో ఢిల్లీ (Delhi) లో ఏపీ భవన్‌కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమయ్యింది. అలాగే మైనింగ్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల పంపిణీకి సంబంధించి ఉన్న వివాదం కూడా ముగిసిపోయింది. ఇదిలాఉండగా ఇప్పటివరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 వరకు సమావేశాలు జరిగాయి. అయినప్పటికీ చాలావరకు సమస్యలు అలాగే ఉండిపోయాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీతో పెండింగ్‌లో ఉన్న సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతాయే దానిపై ఆసక్తి నెలకొంది.
Also Read: అంబేద్కర్ విగ్రహాం ధ్వంసం.. ఆందోళన చేపట్టిన ప్రజా సంఘాలు.!

Advertisment
Advertisment
తాజా కథనాలు