AP : అంబేద్కర్ విగ్రహాం ధ్వంసం.. ఆందోళన చేపట్టిన ప్రజా సంఘాలు.!

కోనసీమ జిల్లా వెల్ల గ్రామం అరుంధతి పేటలో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఘటనపై ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు.

New Update
AP : అంబేద్కర్ విగ్రహాం ధ్వంసం.. ఆందోళన చేపట్టిన ప్రజా సంఘాలు.!

Ambedkar Statue Vandalized In Konaseema District : అంబేద్కర్ కోనసీమ జిల్లా (Konaseema District) రామచంద్రపురం మండలం వెల్ల గ్రామం అరుంధతి పేటలో గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also read: హిజ్రాల మధ్య గ్రూప్ వార్.. బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతుండగా కత్తులు, రాడ్లతో ఇంట్లోకి చొరబడి..

దళితుల మనోభావాలను దెబ్బతినేలా విగ్రహాన్ని ధ్వంసం చేయడం అమానుషం, దారుణమని మండిపడుతున్నారు.  దోషులు ఎంతటి వారైనా 24 గంటల్లో అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నారు సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ దొర రాజు, డి.ఎస్.పి రామకృష్ణ, పోలీస్ సిబ్బంది డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు.

Advertisment
తాజా కథనాలు