Eating With Water Benefits: ఈ ఆహారాలు తినేప్పుడు నీళ్లు తాగుతున్నారా..? అయితే డేంజర్

రెండు ముద్దలు తినగానే ఎక్కిళ్లు వచ్చి వెంటనే నీళ్లు తాగేస్తారు. కానీ.. ఏదైనా తినేప్పుడు నీళ్లు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచికాదని నిపుణులు చెబుతున్నారు. తినేప్పుడు నీళ్లు దూరంగా ఉంచుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు.

Eating With Water Benefits: ఈ ఆహారాలు తినేప్పుడు నీళ్లు తాగుతున్నారా..? అయితే డేంజర్
New Update

Eating Foods Health Benefits: మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు. దీంతోపాటు ఆహారం తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అది కరెక్ట్‌గా లేకపోతే ఇబ్బందులు వస్తాయి. కొంతమంది అయితే అన్నం తినేటప్పుడు నీళ్లు తాగకూడదు అంటారు. అయినా సరే తినేటప్పుడే కొంతమంది నీళ్లు తాగుతుంటారు. కొన్ని పదార్థాలు తినేటప్పుడు నీళ్లు తాగితే నష్టాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ సైంటిఫిక్ స్టడీ ప్రకారం తినేప్పుడు, తిన్న తర్వాత నీళ్లు తాగితే యాసిడ్ పలచగా అయిపోతుందట. అయితే.. ఆహార పదార్థాలతో నీరు తీసుకోవడం సురక్షితం కాదంటున్నారు, వీటి వలన అజీర్ణం, అసౌకర్యంగా ఉంటుంది. నీటితో కలిపి తీసుకోకూడని ఆహారం పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఐటమ్స్ తినేటప్పుడు నీళ్లు తాగకూడదు

1.రైస్‌:

అన్నం తినేప్పుడు నీరు ఎక్కువగా తాగితే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఈ రైస్‌తో పాటు నీళ్లు ఎక్కువగా తాగితే జీర్ణక్రియకు అవసరమైన యాసిడ్స్‌ డైల్యూట్‌ అవుతాయని వైద్యులు చెబుతున్నారు.

2.అరటిపండ్లు:

అరటిపండులో ఉండే ఫైబర్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అరటిపండు తినేప్పుడు నీళ్లు తాగితే కడుపులోని గ్యాస్ట్రిక్ జ్యూస్‌లు కరిగిపోతాయి. దీంతో జీర్ణక్రియ నెమ్మదిస్తుందని నీళ్లు తాగొద్దని నిపుణులు సూచిస్తున్నారు

3.పెరుగు:

పెరుగులో ఉంటే ప్రొబయోటిక్స్‌ పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెరుగు తిన్న తర్వాత నీళ్లు తాగితే ఈ ప్రోబయోటిక్స్‌ ఎఫెక్ట్‌ తగ్గుతుందని అంటున్నారు.

4.స్పైసీ ఫుడ్‌:

చాలామంది మసాలా ఆహారం, స్పైసీ ఫుడ్స్‌ తింటారు. ఆ టైంలో ఎక్కువ నీళ్లు తాగితే అసౌకర్యంగా ఉంటుంది. దీని వలన నీరు వేడిని వ్యాపింపజేసి మంట ఎక్కువ వచ్చేలా చేస్తుంది. అందుకే స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు పాలు, పెరుగు వంటి తీసుకుంటే నోరు చల్లబడుతుంది.

5.సిట్రస్‌ పండ్లు:

పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కమల, ద్రాక్షపండ్లు, బత్తాయి, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు తినేప్పుడు నీళ్లు తాగితే కడుపు అసౌకర్యంగా ఉంటుంది. అందుకే పండ్లు తిన్న తరువాత సుమారు 45 నిమిషాల పాటు గ్యాప్‌ ఇచ్చి నీళ్లు తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

6.ఐస్ క్రీమ్:

చాలామంది ఐస్ క్రీమ్ తిన్న తర్వాత నీటిని తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల చిగుళ్ళు బలహీనపడి దంతాలు దెబ్బతింటాయి. కావున ఐస్ క్రీమ్ తిన్న వెంటనే నీటికి  దూరం ఉంటే మంచిది.

7.స్వీట్స్:

స్వీట్స్ తిన్న తర్వాత నీటిని తాగితే స్వీట్స్‌లో ఉన్న చక్కెర దంతాలపై పడుతుంది.

8.కాఫీ:

ప్రతీరోజూ వీలైనంత వరకు కాఫీ వంటి పానీయాలు తాగినప్పుడు నీటిని తాగకపోవడమే మంచిది.

ఇది కూడా చదవండి: చలికాలంలో రోజూ బెల్లం టీ తాగితే ఎన్నో ప్రయోజనాలో తెలుసా..?

#health-benefits #foods #eating #drinking-water
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe