APSRTC: ఓటు వేయడానికి వస్తున్నారా..అయితే మీకోసమే ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు!

ఏపీలో సోమవారం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో..ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు విజయవాడ ఆర్టీసీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఎలక్షన్ సెల్ ను ఏర్పాటు చేసింది.

APSRTC: ఓటు వేయడానికి వస్తున్నారా..అయితే మీకోసమే ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు!
New Update

APS RTC: : ఏపీలో సోమవారం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్ర ప్రజలు అంతా కూడా ఓటు వేసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. వారి కోసం ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు విజయవాడ ఆర్టీసీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఎలక్షన్ సెల్ ను ఏర్పాటు చేసింది.

ఇతర ఊర్ల నుంచి, రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరుకునే ఓటర్ల కోసం స్పెషల్‌ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బస్సులను ప్రయాణికులు ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని ఎపీఎస్ఆర్టీసీ పేర్కొంది. ఒకే చోటుకు 40 మంది ప్రయాణికులు కంటే ఎక్కువ మంది ఉంటే కనుక అంతా కలిసి బస్సును బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. అందుకోసం ప్రత్యేకంగా 99591 11281 ఫోన్ నెంబరును అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఆర్టీసీ వివరించింది.

Also read: ఓటు వేసే సమయంలో వేసే సిరా ఎందుకు త్వరగా పోదు..అసలు దీని కథేంటి!

#apsrtc #elections #ap #vote #telangana #karnataka
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe