సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeshwari) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం విశాఖలో పర్యటించిన పురందేశ్వరి విశాఖ జిల్లా పార్లమెంట్ స్థాయి మీటింగ్‌లో (Parliament level meeting) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చినట్లు పురందేశ్వరి తెలిపారు. తాను 2004లో రాజకీయాల్లోకి వచ్చినట్లు పురందేశ్వరి తెలిపారు. గత 19 సంవత్సరాలుగా తనకు అండగా ఉంటున్న పార్టీ అగ్ర నాయకత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ దేశం కోసం పని చేస్తున్న పార్టీ అన్నారు. సబ్ కే సాత్ సబ్ కే వికాస్ (Sub K Saath Sub K Vikas) అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం అందరికీ సంక్షేమం అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని పురందేశ్వరి తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాష్ట్రాన్ని కోలుకోకుండా చేస్తే.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఏపీని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఏమీ చేయలేదని రాష్ట్రంలో వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా 4,74000 కోట్లు.. అనధికారికంగా 10,77,006 కోట్ల అప్పు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రాని కేంద్ర ప్రభుత్వం 1 లక్ష 57 వేల 800 ఇళ్లు ఇచ్చిందని, వాటిని ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలకు కేటాయించిందన్న పురందేశ్వరి(Purandeshwari) దీనిపై వేసీపీ సర్కార్ స్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అంతే కాకుండా రాష్ట్రంలోని కొత్త వలస(New migration)లో 1900 కోట్ల రూపాయలతో రైల్వే డబ్లింగ్ పనులను చేపట్టామని, మర్రి వలసలో కేంద్రం రైల్వే జోన్ నిర్మించడానికి ముందుకు వచ్చిందని, కానీ ఏపీ ప్రభుత్వం అందుకోసం భూమిని కేటాయించలేదన్నారు. భోగాపురం(Bhogapuram)లో ఆరు లైన్ల రోడ్డు నిర్మాణానికి 6 వేల 300 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపిన పురందేశ్వరి.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్ని రహదారులు నిర్మించారో చెప్పగలరా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏయిమ్స్ మెడికల్ కాలేజీ(AIIMS Medical College)లను కేటాయించినట్లు గుర్తుచేశారు. జాతీయ స్థాయి విద్యా సంస్థలతో పాటు పెట్రోలియం, గిరిజన యూనివర్సిటీలు, హెచ్‌పీసీయల్ ఎక్స్ టెన్షన్, ఇండస్ట్రీయల్ కారిడార్‌లను కేటాయించినట్లు పురందేశ్వరి వెల్లడించారు.
మరోవైపు రాష్ట్రంలో వైసీపీ నేతలు స్థానికుల భూములను దోచేస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడిభూములను చుక్కల భూములుగా చూపించి కబ్జాకు పాల్పడుతున్నారని.. కబ్జా నాయకులకు ఎదురు మాట్లాడిన వారిని వైసీపీ నేతలు చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శాంతి భద్రతల విషయంలో ఏపీ ఇంట్లో దుండగులు పడ్డ రక్షించే నాదుడేలేరని పురందేశ్వరి విమర్శించారు.