Andhra Pradesh : ఇదేం దిగజారుడుతనం..? కండోమ్ ప్యాకెట్లతో రాజకీయాలేంటి?

ఒక ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న రెండు రాజకీయ పార్టీల మధ్య వైరం సర్వ సాధారణం. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, తిట్టుకోవడం ఇలాంటివన్నీ చాలా కామన్. కానీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది మాత్రం ఇందుకు విభిన్నంగా ఉంది. ఏకంగా కండోమ్ ప్యాకెట్లతో ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు.

New Update
Andhra Pradesh : ఇదేం దిగజారుడుతనం..? కండోమ్ ప్యాకెట్లతో రాజకీయాలేంటి?

AP TDP, YCP Posts In Social Media : ఇటీవల కాలంలో రాజకీయాలు చాలా దిగజారిపోతున్నాయి. దేశ ప్రగతి కోసం పని చేయాల్సిన రాజకీయ నాయకులు(Political Leaders) ప్రత్యర్థులపై బురదజల్లడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక తిట్ల పురాణం గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. చూపించేవాడికి శక్తి, వినేవాడికి ఓపిక ఉండాలే కానీ... ఎంతసేపైనా ఆ తిట్ల పురాణాలు, బూతుల పంచాంగాలూ వినిపిస్తూనే ఉంటాయి. వీటికి తోడు అసత్య ప్రచారాలు, పార్టీల నుంచి జంపింగ్‌(Jumping) లో వీటికి అయితే కొదువే ఉండదు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆంధ్రలో జరుగుతున్న రాజకీయాలు మరొక ఎత్తు. ఇక్కడ రెండు పార్టీల మధ్య వార్ రోజు రోజుకూ దిగజారి పోతోంది. ఈ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, వ్యక్తులు దిగజారడానికి ఇంతకంటే ఏం లేదు అన్న చందంగా ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు.

కండోమ్స్‌నూ వదలడం లేదు..

ఆంధ్రా(Andhra Pradesh) లో టీడీపీ(TDP), వైసీపీ పార్టీ(YCP Party) నేతల మధ్య వార్ రోజురోజుకూ పెరగిపోతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇది మరింత ఎక్కువ అయిపోతోంది. నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు, ఫ్యామిలీ మెంబర్స్ ని సైతం టార్గెట్ చేస్తూ చేసే తిట్లు, వ్యక్తిత్వ హననాలతో పాటూ వీళ్ళు మరొక అడుగు ముందుకేసి కండోమ్ ప్యాకెట్ల(Condom Packets) తో ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు. తమ స్థాయిని దిగజార్చుకుంటూ ఎక్స్‌(X) లో పోస్ట్‌లు పెట్టుకుంటున్నారు. "భవిష్యత్తుకు గ్యారెంటీ" పేరుతో టీడీపీ నేతలు, "సిద్ధం" సభల పేరుతో వైసీపీ నాయకులు కండోమ్ ప్యాకెట్లు పంచుతున్నారంటూ రెండు పార్టీలు ఎక్స్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. పైగా ఆ పోస్ట్‌లలో త‌మ పార్టీ ప్రచారం కోసం చివ‌రికి ప్రజ‌ల‌కు కండోమ్‌లు కూడా పంపిణీ చేస్తోంది @JaiTDP. ఇదెక్కడి ప్రచార పిచ్చి? నెక్ట్స్ వ‌యాగ్రాలు కూడా పంచుతారేమో? క‌నీసం అక్కడితోనైనా ఆగుతారా? లేక‌పోతే మున్ముందు ఇంకా దిగ‌జారుతారా అని వైసీపీ రాసుకొస్తే... సిద్ధం.. సిద్ధం అంటూ కేకలు పెట్టేది ఇందుకా? ఇలాంటి నీచపు ప్రచారాలు చేసే బదులు శవాల మీద చిల్లర ఏరుకోవచ్చు కదా అంటూ టీడీపీ దిగజారి పోయి మరీ క్యాప్షన్లు రాసుకున్నారు.

మండిపడుతున్న జనం...

టీడీపీ, వైసీపీ పోస్టులను చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటికి మీరు చేస్తున్న చెత్త చాలదా... అంతకన్నా దిగజారిపోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవేం రాజకీయ ప్రచారాలు... కొంచెం కూడా బుద్ధి ఉండక్కర్లేదా అంటూ తిట్టిపోస్తున్నారు. గెలవడానికి ఇంత నీచ స్థితికి దిగజారిపోవాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read : Pakistan : పాకిస్తాన్‌లో సంకీర్ణం… కొత్త ప్రధానిగా షహబాజ్ షరీఫ్

Advertisment
Advertisment
తాజా కథనాలు