Andhra Pradesh: ఏపీ మంత్రుల జాబితా విడుదల..లిస్ట్ ఇదే

ఏపీ కొత్త ప్రభుత్వానికి సంబంధించి మంత్రుల జాబితా విడుదల అయింది. కేంద్ర మంత్రి అమిత్‌ షాతో సమావేశం తర్వాత మంత్రుల పేర్లు ఖరారు చేశారు. ఇందులో జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌కు చోటు దక్కింది.

New Update
Andhra Pradesh: ఏపీ మంత్రుల జాబితా విడుదల..లిస్ట్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈరోజే ప్రమాణం చేయనున్నారు. ఈరోజు ఉదయం 11.27 ఆయన ప్రమాణం చేయనున్నారు. ఈయనతో పాటూ ఏపీ కొత్త ప్రభుత్వంలో మొత్తం 24 మంది మంత్రులుగా బాధ్యతలు చేట్టనున్నారు. వీరి లిస్ట్‌ను నిన్న అర్ధరాత్రి దాటాక విడుదల చేశారు. ఈ 24 మందిలో జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి చోటు దక్కింది. రేపు చంద్రబాబుతో పాటూ మొత్తం 24 మందీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక జనసేన అధిపతి పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు మంత్రి వర్గంలో లభించింది.

కొత్త మంత్రుల లిస్ట్ ఇదే..

  1. నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి)
  2. కొణిదెల పవన్ కళ్యాణ్ 
  3. కింజరాపు అచ్చెన్నాయుడు 
  4. కొల్లు రవీంద్ర 
  5. నాదెండ్ల మనోహర్
  6. పి.నారాయణ 
  7. వంగలపూడి అనిత 
  8. సత్యకుమార్ యాదవ్ 
  9. నిమ్మల రామానాయుడు 
  10. ఎన్.ఎమ్.డి.ఫరూక్ 
  11. ఆనం రామనారాయణరెడ్డి 
  12. పయ్యావుల కేశవ్ 
  13. అనగాని సత్యప్రసాద్ 
  14. కొలుసు పార్థసారధి 
  15. డోలా బాలవీరాంజనేయస్వామి 
  16. గొట్టిపాటి రవి 
  17. కందుల దుర్గేష్ 
  18. గుమ్మడి సంధ్యారాణి 
  19. బీసీ జనార్థన్ రెడ్డి 
  20. టీజీ భరత్ 
  21. ఎస్.సవిత 
  22. వాసంశెట్టి సుభాష్ 
  23. కొండపల్లి శ్రీనివాస్ 
  24. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
  25. నారా లోకేష్ 

Also Read:India Army: భారత కొత్త ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్‌ జనరల్ ఉపేంద్ర ద్వివేది

Advertisment
తాజా కథనాలు