Minister Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం, కందిపప్పు ధరలు తగ్గేలా చూడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. దీనిపై ఏపీ బియ్యం, కందిపప్పు వ్యాపారులతో సమీక్ష జరిపారు. బియ్యం, కందిపప్పు రేట్లను సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని వ్యాపారులకు మంత్రి ఆదేశించారు. బ్లాక్ మార్కెట్ వంటి చర్యలకు పాల్పడవద్దని నాదెండ్ల సూచించారు. 11వ తేదీ నుంచి రైతు బజార్లల్లో కందిపప్పు, బియ్యం అమ్మకాలు జరపాలని వ్యాపారులతో కలిసి మంత్రి నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయంతో పాటూ రైతు బజార్లల్లో అమ్మే బియ్యం, కందిపప్పు ధరలను కూడా ఖరారు చేశారు మంత్రి నాదెండ్ల. కందిపప్పు కిలో రూ. 160, స్టీమ్డ్ రైస్ కేజీ రూ. 49, ముడి బియ్యం రూ. 48కే రైతు బజార్లల్లో విక్రయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కందిపప్పు రూ. 181, స్టీమ్డ్ రైస్ రూ. 55.85, ముడి బియ్యం రూ. 52.40లకు వ్యాపారులు అమ్ముతున్నారు.
Also Read:Telangana: తెలంగాణ సీఎంకు సారీ చెప్పిన నటుడు సిద్ధార్థ్