Andhra Pradesh: రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు-మంత్రి నాదెండ్ల ఆదేశం బియ్యం, కందిపప్పు ధరల స్థిరీకరణ మీద ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. వీటి తాలూకా రేట్లు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు అమ్మకాలు జరపాలని నిర్ణయించారు. By Manogna alamuru 09 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Minister Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం, కందిపప్పు ధరలు తగ్గేలా చూడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. దీనిపై ఏపీ బియ్యం, కందిపప్పు వ్యాపారులతో సమీక్ష జరిపారు. బియ్యం, కందిపప్పు రేట్లను సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని వ్యాపారులకు మంత్రి ఆదేశించారు. బ్లాక్ మార్కెట్ వంటి చర్యలకు పాల్పడవద్దని నాదెండ్ల సూచించారు. 11వ తేదీ నుంచి రైతు బజార్లల్లో కందిపప్పు, బియ్యం అమ్మకాలు జరపాలని వ్యాపారులతో కలిసి మంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో పాటూ రైతు బజార్లల్లో అమ్మే బియ్యం, కందిపప్పు ధరలను కూడా ఖరారు చేశారు మంత్రి నాదెండ్ల. కందిపప్పు కిలో రూ. 160, స్టీమ్డ్ రైస్ కేజీ రూ. 49, ముడి బియ్యం రూ. 48కే రైతు బజార్లల్లో విక్రయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కందిపప్పు రూ. 181, స్టీమ్డ్ రైస్ రూ. 55.85, ముడి బియ్యం రూ. 52.40లకు వ్యాపారులు అమ్ముతున్నారు. రాష్ట్రంలో నిత్యావసర ధరల నియంత్రణకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇష్టానుసారంగా ధరలు పెంచకుండా కందిపప్పు, బియ్యం ధరల స్థిరీకరణకు ఆదేశాలు ఇచ్చింది. కందిపప్పు బహిరంగ మార్కెట్లో కిలో రూ.181కి, రైతు బజార్లలో రూ.160కి అమ్మటానికి అనుమతి ఇచ్చింది. అలాగే బియ్యం ధరలు బహిరంగ మార్కెట్లో… pic.twitter.com/uwCaRDrByQ — Telugu Desam Party (@JaiTDP) July 8, 2024 Also Read:Telangana: తెలంగాణ సీఎంకు సారీ చెప్పిన నటుడు సిద్ధార్థ్ #andhra-pradesh #minister #nadendla-manohar #rice #toordal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి