AP : ఏపీలో పింఛన్ల పెంపు పై కసరత్తు!

సామాజిక భద్రత పింఛన్ల పెంపు పై అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. రూ 4 వేల పింఛను పెంపును ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో తెలిపింది.పెంచిన పింఛన్లను జులై 1 నుంచే అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.

New Update
Telangana: ఉద్యోగులకు శుభవార్త...ఆగస్ట్‌ 15 తరువాత డీఏ ప్రకటన!

Increase Pensions : సామాజిక భద్రత పింఛన్ల (Pensions) పెంపు పై అధికారులు కసరత్తులు మొదలు పెట్టేశారు. రూ 4 వేల పింఛను పెంపును ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా టీడీపీ (TDP), జనసేన (Janasena) కూటమి ఉమ్మడి మేనిఫెస్టో లో తెలిపిన విషయం తెలిసిందే.

దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచుతామని రెండు పార్టీలు కూడా హామీనిచ్చాయి. పెంచిన పింఛన్లను జులై 1 నుంచే అమల్లోకి తీసుకుని వస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు రంగంలోకి దిగి కసరత్తులు ప్రారంభించారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 65.30 లక్షల మంది పింఛను లబ్ధిదారులున్నారు. వీరందరికి పింఛను నగదు కింద నెలకు రూ. 19.39 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఏప్రిల్‌ నుంచే రూ.4 వేల పింఛను పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి రూ.7 వేలు , దివ్యాంగులకు 6 వేల పింఛను ను జులై 1 నుంచి పంపిణీ చేయడానికి మొత్తం రూ.4,400 కోట్లు అవుతుందుని అధికారులు అంచనా వేశారు.

అదే విధంగా ఆగస్టు నుంచి అయితే నెలకు రూ.2,800 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

Also read: ఈఏపీ సెట్ ఫలితాలు నేడు విడుదల!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు