Andhra Pradesh : ఏపీలో సంక్షేమ పథకాల నిధులు విడుదల

ఎన్నికల సంఘం ఆంక్షలు పోలింగ్‌తో ముగియడంతో.. డీబీటీ పథకాలకు నిధులు విడుదల చేళారు. బుధవారం ఆసరా పథకానికి రూ.1480 కోట్లు విడుదల చేశారు. అలాగే జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్‌ కోసం రూ.502 కోట్లు విడుదల అయ్యాయి.

New Update
Andhra Pradesh : ఏపీలో సంక్షేమ పథకాల నిధులు విడుదల

Welfare Schemes : ఏపీ(AP) లో సంక్షేమ పథకాల్లో భాగంగా లబ్దిదారులకు అందిస్తున్న నగదు బదిలీ(Money Transfer) ప్రారంభమైంది. ఎన్నికల సంఘం(Election Commission) ఆంక్షలు పోలింగ్‌తో ముగియడంతో.. డీబీటీ పథకాలకు నిధులు విడుదల చేశారు. బుధవారం ఆసరా పథకానికి రూ.1480 కోట్లు విడుదల చేశారు. అలాగే జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్‌ కోసం రూ.502 కోట్లు విడుదల అయ్యాయి. మిగిలిన పథకాలకు కూడా ఈరోజు, రేపు నిధులు విడుదల చేయనున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటన చేసింది. రెండు, మూడు రోజుల్లో పూర్తి నిధులు విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

Also Read: ఢిల్లీకి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో ఆరు పథకాలకు చెందిన దాదాపు రూ.14 వేల కోట్లను లబ్దిదారులకు విడుదల చేస్తూ సీఎం జగన్(CM Jagan) బటన్ నొక్కారు. అయితే రాష్ట్ర ఖజానాలో తగినన్ని నిధులు ఉన్నప్పటికీ కూడా బటన్ నొక్కిన వెంటనే నగదు జమ చేయకుండా ఎన్నికల పోలింగ్ వరకు వేచి చూశారని.. పోలింగ్ ముందు ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమయ్యారని టీడీపీ ఆరోపణలు చేసింది. ఈ డబ్బును కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు చేసింది. దీంతో ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేయగా.. తాజాగా ఆ నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Advertisment
తాజా కథనాలు