వైసీపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకంది. విశాఖపట్నంలో 35 ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు చేసేందుకు భవనాలు కేటాయిస్తూ.. గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా 2.27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ప్రస్తుతం అందుబాటులో ఉందని ఏపీ ప్రభుత్వం తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే కార్యాలయాలు, విడిది అవసరాలకు కూడా భవనాలను కేటాయించింది. ఆంధ్రా యూనివర్సిటీ, రుషికొండ,చినగదిలి సమీపంలో ఈ భవనాలను కేటాయించారు. పలు శాఖలకు ఎండాడ, హనుమంత్వాక ప్రాంతాల్లో కూడా కేటాయించింది.
Also Read: రూ.100 కోట్ల స్కామ్ కేసుకు సంబంధించి నటుడు ప్రకాశ్ రాజుకు ఈడీ సమన్లు
అయితే జీఏడీ, ఆర్థిక, గ్రామవార్డు సచివాలయ. ఇంధన మినహాయించి ఇతర శాఖలకు ఈ భవనాలను కేటాయించింది. అధికాకుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ శాఖలకు భవనాలను కేటాయించినట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. అయితే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎక్కడ ఉందో మాత్రం ప్రభుత్వం తమ జీవోలో వెల్లడించలేదు.
Also read: ఏపీలో రోడ్ల దుస్థితిపై స్వయంగా వీడియో తీసిన వైసీపీ ఎంపీ.. ఏం చేశాడంటే..?