Minister Gummanur Jayaram: ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులను మారుస్తున్న వైసీపీ అధిష్టానం.. ఐదో లిస్టు పై కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా తాజాగా మంత్రి గుమ్మనూరు జయరాంకు (Gummanur Jayaram) వైసీపీ పార్టీ షాక్ ఇచ్చింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బీవై రామయ్యను ఖరారు చేసింది. ఇప్పటికే ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా బుట్టా రేణుక ఫైనల్ చేసింది. రేపు రెండు స్థానాలను వైసీపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రి గుమ్మనూరు జయరాంను పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనీ వైసీపీ అధిష్టానం కోరగా.. దానికి ఆయన నో అని అన్నారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అధిష్టానానికి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా అధిష్టానం ఎంత ప్రయత్నించినా అందుబాటులోకి మంత్రి జయరాం రావట్లేదని వైసీపీ నేతల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది.
ALSO READ: మళ్లీ ఎన్డీఏ గూటికి చేరనున్న నితీశ్ కుమార్.. !
ఎంపీ అభ్యర్థులపై కసరత్తు..
గత ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలకు గాను 22 ఎంపీలను గెలుచుకుంది అధికార పార్టీ వైసీపీ. ఈ సారి కూడా అదే రికార్డ్ స్థాయిలో గెలిచేందుకు మార్పులు చేర్పులు చేస్తోంది. దాదాపు ఎంపీ అభ్యర్థుల పేర్లును అధిష్టానం ఖరారు చేసింది. కొందరు సిట్టింగ్‌లను మార్చిన వైసీపీ..కొంతమంది ఎంపీలకు ఎమ్మెల్యేలుగా ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ లో ఎవరెవరున్నారంటే..?
వైసీపీ ఎంపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్..!
1.విజయనగరం ఎంపీ అభ్యర్థిగా మజ్జి శ్రీనివాస్
2. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కిలారు పద్మ
3. కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చలమ శెట్టి సునీల్
4. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా డైరెక్టర్ వి.వి.వినాయక్
5. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
6. నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఖాదర్ బాషా లేదా అలీలకు ఛాన్స్
Also Read: ఫ్రాన్స్ అధ్యక్షుడికి రామ్ లల్లా విగ్రహాన్ని కానుకగా ఇచ్చిన ప్రధాని మోడీ
DO WATCH: