France President Emmanuel Macron : రిపబ్లిక్ డే ముఖ్య అతిధిగా ఆహ్వానం అందుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఈరోజు భారత దేశానికి వచ్చారు. రెండు రోజు లపాటూ ఆయన బారతదేశంలో పర్యటించనున్నారు. నిన్న జైపూర్‌కు చేరుకున్న మెక్కాన్ అక్కడ ఆమెర్ కోటను సందర్శించారు. ప్రధాని మోడీ (PM Modi) ఫ్రాన్స్ అధ్యక్షుడిని రిసీవ్ చేసుకుని ఆయనతో పాటూ కోటను సందర్శించారు. కోట దగ్గర ఉన్న హస్తకళల దుకాణంలో అయోధ్య రామ మందిర (Ayodhya Ram Mandir) నమూనాను కొనుగోలు చేసి బహూకరించారు. దానితో పాటూ రామ్ లల్లా విగ్రహాన్ని పోలిన బొమ్మను కూడా కొనిచ్చారు. తరువాత నేతలిద్దరూ సాహూ చాయ్ వాలా దగ్గర మసాలా టీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నారు. అనంతరం ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇక ఈరోజు డిల్లీ చేరుకుని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి..Ram Lalla idol Gift:ఫ్రాన్స్ అధ్యక్షుడికి రామ్ లల్లా విగ్రహాన్ని కానుకగా ఇచ్చిన ప్రధాని మోడీ
రిపబ్లిక్ డే ముఖ్య అతిధిగా హాజరయిన ఫ్రాన్స్ అధ్యక్షునికి ప్రధాని మోడీ అద్భుతమైన బహుమతిని ఇచ్చారు. ఇటీవల అయోధ్య ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రామ్ లల్లా విగ్రహాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు అందజేశారు. అచ్చు రామ్ లల్లా విగ్రహం మాదిరిగా ఉండే బొమ్మను ఇచ్చారు.
Translate this News: