TDP Leader Bonda Uma On Phone Tapping: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లోను ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఈసీ ఉన్నత అధికారుల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని అన్నారు. పోలీస్ ఉన్నత అధికారులు తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని.. గతంలోనే ఐపీఎస్ రూల్స్ కు బదులు వైసీపీ రూల్స్ ని కొందరు అధికారులు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల తెలంగాణంలోను ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
ALSO READ: వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
ఇటీవల తెలంగాణలోనూ..
ప్రతిపక్ష నాయకుల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఏపీకి చేరింది. తమ పార్టీ నేతలతో సహా అధినేత ఫోన్లను వైసీపీ ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ట్యాపింగ్ చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమ చెప్పిన విషయం తెలిసిందే.అయితే ఇటీవల తెలంగాణలో కూడా ఫోన్లు ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పోలీస్ అధికారులు బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడుతుందని.. సాక్షాలను తారు మారు చేసేందుకు ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ లను కాల్చి వేసినట్టు SIB అధికారులు గుర్తించారు. ప్రణీత్ రావు ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
రేవంత్ రెడ్డే టార్గెట్..
సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు SIB అధికారులు గుర్తించారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో చెప్పిన విషయాలతో ఇది వెలుగులోకి వచ్చింది. ఆనాడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన ఎవరితో సంభాషణ చేశారు అనే విషయాలను ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని ఒక బీఆర్ఎస్ నేతకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వాట్సాప్ చాట్ లు బయటపెట్టారు SIB అధికారులు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది.