Glass Symbol Allotted For Janasena: జనసేన పార్టీకి బిగ్ రిలీఫ్ అందించింది ఎన్నికల కమిషన్ (Election Commission). జనసేన పార్టీకి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
Also Read: చంద్రబాబు అరెస్ట్.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్ధులు పోటీ చేసిన విషయం విదితమే. అదే విధంగా ఈ సారి ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు గుర్తుతోనే జనసేన అభ్యర్ధులు ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఈ ఉత్తర్వు కాపీలను పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్ బుధవారం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు (Pawan Kalyan) అందజేశారు.
వైసీపీ ఫిర్యాదు..
జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించద్దని గతంలో వైసీపీ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఏపీ పర్యటనలో ఎన్నికల సంఘం ఉన్న సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈసీ బృందాన్ని కలిసి టీడీపీ, జనసేన పార్టీలపై ఫిర్యాదు చేశారు. ఎక్కడ గుర్తింపు లేని జనసేన పార్టీకి కామన్ సింబల్ ఇవ్వొద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేన పార్టీకి గుర్తింపు లేదని, అలాంటి పార్టీకి రెండు వరుస ఎన్నికల్లో కామన్ సింబల్ ఎలా కేటాయిస్తారని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో జనసేన పార్టీ గుర్తుపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఈసీ నిర్ణయంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నారు.
ALSO READ: తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు
DO WATCH: