Chandrababu: జగన్‌ను దెబ్బకొట్టేలా చంద్రబాబు పర్యటనలు

ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు చంద్రబాబు. మొత్తం 5 రోజుల పాటు 'ప్రజాగళం' పేరుతో సభలు, రోడ్ షో లు నిర్వహించనున్నారు. అయితే, 27 నుంచి సీఎం జగన్ కూడా 'మేమంతా సిద్ధం' పేరుతో బస్సు యాత్రలు చేపట్టనున్న విషయం తెలిసిందే.

New Update
Chandrababu: జగన్‌ను దెబ్బకొట్టేలా చంద్రబాబు పర్యటనలు

TDP Chief Chandrababu: ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. అధికారంలోకి వచ్చేందుకు అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇటీవల సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి ఈ నెల 27 నుంచి 'మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రలు చేపడుతుండగా తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించారు. ఈ నెల 27 తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి మొదలు పెడుతున్నట్లు వెల్లడించారు. ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షో లు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

ALSO READ: సీఎం జగన్‌కు బిగ్ షాక్.. కాంగ్రస్‌లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

* ప్రజాగళం పేరుతో ఈనెల 27 వ తేదీ నుంచి వరుసగా పర్యటనలు
* 27 తేదీ నుంచి 31 తేదీ వరకు పర్యటన ఖారారు
* 27వ తేదీ పలమనేరు, నగిరి, నెల్లూరు రూరల్ లలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
* 28వ తేదీ రాప్తాడు, సింగనమల, కదిరి లలో పర్యటన..
* 29వ తేదీ శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30 మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరిపేట, శ్రీకాళహస్తిలలో చంద్రబాబు పర్యటన..
* 31వ తేదీ కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు చంద్రబాబు పర్యటనలు ఉండనున్నాయి.

జగన్ కూడా 'సిద్ధం'

ఈ నెల 27 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయనున్నారు. ఇడుపులపాయ నుండి సీఎం జగన్ ఈ బస్సుయాత్ర మొదలు పెడతారని సజ్జల పేర్కొన్నారు. రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కలుస్తారని అన్నారు. సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలో బస్సుయాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు యాత్ర జరుగుతుందని తెలిపారు. తరువాత మిగిలిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని అన్నారు. సీఎంగా ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్ కష్టపడ్డారని పేర్కొన్నారు.

* 27న ప్రొద్దుటూరులో తొలి సిద్ధం సభ.
* 28న నంద్యాలలో బహిరంగ సభ.
* 30న ఎమ్మిగనూరులో సభ.

Advertisment
తాజా కథనాలు