YSRCP: వైసీపీ అసంతృప్తి నేతల భేటీ.. జగన్‌కు మరో షాక్ తగలనుందా?

ఆలూరు నియోజకవర్గ అసంతృప్తి నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయించాలని.. లేదంటే వైసీపీకి రాజీనామా చేస్తామని అక్కడి జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు సీఎం జగన్‌ను హెచ్చరించారు.

YSRCP: వైసీపీ అసంతృప్తి నేతల భేటీ.. జగన్‌కు మరో షాక్ తగలనుందా?
New Update

Kurnool YCP Politics: మరికొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) జరగనున్న నేపథ్యంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ కు (CM Jagan) తలనొప్పిగా మారింది. సొంత పార్టీ నేతలే వైసీపీకి (YSRCP) రాజీనామా చేసి సీఎం జగన్ కు షాక్ లు ఇస్తున్నారు. వైసీపీ నేతల రాజీనామాలకు ముఖ్య కారణం ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ (MLA Ticket) ఇవ్వకపోవడమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ALSO READ: జగన్ ఇక మాజీ సీఎం.. KA పాల్ శాపనార్థాలు

ఆలూరులో అసంతృప్తి సెగలు...

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్ సర్వేల డేటా ఆధారంగా గెలిచే అవకాశం లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. ఈ నేపథ్యంలో టికెట్ ఆశించిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టికెట్ రాకపోవడంతో వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా ఈ అసంతృప్తి సెగలు ఆలూరు నియోజకవర్గానికి తగిలాయి. ఆలూరు లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్(Gummanur Jayaram) క్యాంపు కార్యాలయంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ఆ నియోజకవర్గ జడ్పీటీసీలు (ZPTC), ఎంపీపీలు (MPP), సర్పంచ్ లు(Sarpanch) హాజరయ్యారు. ఆలూరు YSRCP టెకెట్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మానురు జయరామ్ కు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

కొత్తవారికి ఇస్తే ఓడిపోతాం..

ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కొత్త వారికి టికెట్ కేటాయిస్తే పోటీ చేసే అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉందని నేతల ఆవేదన వ్యక్తం చేశారు. మూడు పర్యాయాలు ఆలూరు నుంచి పోటీ చేసిన వ్యక్తి గుమ్మానురు జయరామ్.. రెండు సార్లు వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచి మంత్రి గా ఎన్నికయ్యారని అన్నారు. బీసీ నేతగా ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి జయరామ్ కృషి చేశారని పేర్కొన్నారు.

రాజీనామా చేస్తాం..

గుమ్మానురు జయరామ్ కు టికెట్ ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేసి భవిష్యత్ కార్యాచరణ పై సమాలోచన చేస్తామని ఆలూరు వైసీపీ నేతలు హెచ్చరించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలూరు టికెట్ విషయంలో తొందరగా నిర్ణయం తీసుకొని కార్యకర్తలలో ఉన్న టెన్షన్ కు తెరదింపాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ALSO READ: సైఫ్ మీద వచ్చిన ఆరోపణలు నిజమే.. ర్యాగింగ్ నిరోధక కమిటీ

#cm-jagan #ysrcp #ap-assembly-elections #kurnool-news #alur-assembly #ycp-leaders-resign
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe