/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/cbn-pawan-harirama-letter-jpg.webp)
Harirama Jogaiah Letter to TDP-Janasena: కాపుల సంక్షేమం కోసం పాటుపడే మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య జనసేన, టీడీపీ పొత్తుపై విసుగు చెందినట్టుగా అర్థమవుతోంది. జనసేనకు కేవలం 24 సీట్లే ఇవ్వడాన్ని అంగీకరించని జోగయ్య ఇటివలి కాలంలో లేఖస్త్రాల సంఖ్యను రెట్టింపు చేశారు. కూటమిలో ప్రాధాన్యత, స్పష్టత రావాలని డిమాండ్ చేస్తూ జనసేన అధినేతకు ఆయన అనేక లేఖలో సలహాలు ఇస్తూ వస్తున్నారు. అయితే ఇకపై పొత్తు గురించి పవన్‌తో (Pawan Kalyan) పాటు చంద్రబాబుకు (Chandrababu) సైతం సలహాలు ఇవ్వడం మానేయాలని హరిరామ జోగయ్య నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తనకు, పార్టీకి అండగా నిలబడే వారే కావాలి తప్ప వేరే చోట కూర్చొని సలహాలు ఇచ్చే వారు కాదని పవన్ కల్యాణ్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హరిరామ జోగయ్య రాసిన లేఖ సంచలనం రేపుతోంది.
లేఖలో ఏముంది?
'నేను ఇచ్చిన సలహాలు ఇద్దరు అధినేతలకు నచ్చినట్లు లేవు...
అది వారి ఖర్మ...ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు..'
అని జోగయ్య లేఖ రాయడం కాక రేపుతోంది. తన సలహాలు చంద్రబాబు, పవన్‌కు నచ్చినట్టుగా లేవని.. ఇంక తాను చేయగలిగిందేమీ లేదని జోగయ్య చెప్పుకొచ్చారు. 'అది వారి ఖర్మ' అంటూ ఫైర్ అయ్యారు. నిజానికి కొన్ని రోజులుగా జోగయ్య పవన్‌పై చాలా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. కాపులు సీఎంగా ఉండాలన్నదే జోగయ్య లక్ష్యం. అప్పుడే వారి కులం ముందుకు వెళ్తుందని ఆయన నమ్మకం. అదే కాపు కులానికి చెందిన పవన్ కేవలం 24 అసెంబ్లీ స్థానాల్లోనే పోటి చేస్తుండడం జోగయ్యకు నచ్చలేదు. పొత్తులో భాగంగా జనసేన 50-60 స్థానాల్లో పోటి చేయాలని ఆయన అనేకసార్లు బలంగ తన గళాన్ని వినిపించారు. అయితే జనసేనకు కేవలం 24 సీట్లే కేటాయిస్తుండడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని అంశాలపై స్పష్టత కోరుతూ హరిరామ జోగయ్య (Harirama Jogaiah) ఇప్పటికే అనేక లేఖలు రాశారు. ఈ క్రమంలోనే ఇటివలి కాపు సామాజిక వర్గానికి బహిరంగ లేఖ రాశారు. కూటమి అధికారంలోకి రావాలంటే పవన్ కళ్యాణ్ పాత్ర ఏమిటని ఆయన ప్రశ్నించారు.
Also Read: ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. 11,062 పోస్టులను DSC నోటిఫికేషన్!