AP Congress Chief YS Sharmila: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల సీఎం జగన్ టార్గెట్ గా విమర్శల దాడులు చేస్తున్నారు. తాజాగా మరోసారి సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబంలో చిచ్చు పెట్టిందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా స్పందించారు. ఇవాళ YSR కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అన్న గారే అని అన్నారు. దీనికి సాక్ష్యం దేవుడు, తన తల్లి, వైఎస్సార్ భార్య విజయమ్మ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్, చంద్రబాబు కారణం..
నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే చంద్రబాబు, జగన్ అన్న కారణం అని అన్నారు షర్మిల. ఇవాళ YSR కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అన్నానే అని అన్నారు. దీనికి సాక్ష్యం తన తల్లి, వైఎస్సార్ భార్య విజయమ్మ అని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందిలో ఉంటే 18 మంది రాజీనామాలు చేసి జగన్ అన్న వైపు నిలబడితే అధికారంలో వచ్చాక మంత్రులను చేస్తా అన్నారని.. ఇవాళ వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు? అని ప్రశ్నించారు.
ALSO READ: చంద్రబాబు స్క్రిప్ట్.. షర్మిల వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్
నన్ను పాదయాత్ర చేయమన్నారు..
పార్టీ కష్టాల్లో ఉందని తనను పాదయాత్ర చేయమని వైసీపీ ముఖ్య నేతలు కోరినట్లు షర్మిల తెలిపారు. సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే కాదా అని ఆ యాత్ర కూడా చేశా అని షర్మిల అన్నారు. తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశానని.. ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డా అని అన్నారు.
జగన్ మారిపోయాడు..
గత ఎన్నికల్లో బై బై బాబు అంటూ ఊరూరా తిరిగానని అన్నారు షర్మిల. వైసీపీని గెలిపించానని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత మారిపోయాడని పేర్కొన్నారు. సీఎం జగన్ మంచి ముఖ్యమంత్రి అయితే చాలు ..YSR పేరు, ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్నానని అన్నారు. ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీ కి బానిసలు గా మారారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
DO WATCH: