AP CM Chandrababu : పెన్షన్‌ దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ!

ఏపీ సీఎం చంద్రబాబు పింఛన్‌ దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వం ముందున్న మొదటి కర్తవ్యమని వివరించారు. మీకు అండగా ఉంటూ..సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ప్రస్తుతం ఏపీలో ఏర్పాటైందని బాబు అన్నారు.

New Update
AP Govt Employees: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. 8 శాతం పెంపు!

AP CM Open Letter To Pensions :  ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) పింఛన్‌ (Pension) దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వం ముందున్న మొదటి కర్తవ్యమని వివరించారు. మీకు అండగా ఉంటూ..సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ప్రస్తుతం ఏపీలో ఏర్పాటైందని బాబు అన్నారు.

దివ్యాంగులకు పింఛన్‌ రూ. 6 వేలు ఇస్తున్నందుకు ఆనందంగా ఉందని.. జులై 1 నుంచే పెంచిన పెన్షన్లను ఇంటి వద్దే అందిస్తామని ఆయన తెలిపారు. ఆర్థిక సమస్యలున్నా..ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నాం.

పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వం పై నెలకు అదనంగా రూ. 819 కోట్ల భారం పడనుంది. నాటి అధికార పక్షం మిమ్మల్ని పెన్షన్‌ విషయంలో ఎంతో క్షోభ పెట్టింది. మండుటెండలో, వడగాల్పుల (Hail) మధ్య మీరంతా పడిన అగచాట్లు చూశా. ఏప్రిల్‌ నెల నుంచే పెన్షన్‌ పెంపును వర్తింపజేస్తానని మాట ఇచ్చినట్లు చంద్రబాబు అన్నారు.

ఏప్రిల్‌, మే , జూన్‌ నెలలకూ పెంపును వర్తింపజేసి మీకు అందిస్తున్నామని లెటర్‌ లో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Also read: భర్తల్ని మద్యం ఇంటికే తెచ్చుకొని తాగమనండి..మంత్రి సలహా!

Advertisment
తాజా కథనాలు