AP Cabinet : ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో రైతు రుణమాఫీ?

ఈ నెల 31న సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై చర్చించనున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, డీఎస్సీ నోటిఫికేషన్ తదితర అంశాలపై మంత్రి వర్గం చర్చించనుంది.

New Update
AP Cabinet : ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో రైతు రుణమాఫీ?

Good News To AP Farmers : మరికొన్ని నెలల్లో ఎన్నికలు(Elections 2024) జరగనున్న వేళ ప్రజలను ఆకట్టుకునేందుకు వైసీపీ(YCP) ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 31న సీఎం జగన్(CM Jagan) అధ్యక్షతన ఏపీ మంత్రి వర్గం సమావేశం కానుంది. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాల లో ప్రవేశ పెట్టె బడ్జెట్ పై చర్చించనున్నారు. వచ్చే నెలలో వైసీపీ ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త పథకాలు అలాగే.. జగనన్న కాలనిలకు సంబంధించిన అంశాలపై వారు చర్చించనున్నారు.

డీఎస్సీ నోటిఫికేషన్..

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులను(Un-Employees) తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ ప్రభుత్వం త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 31న జరగబోయే కేబినెట్ భేటీలో మంత్రులు ఆమోదం తెలపనునట్లు సమాచారం. అయితే ఎన్నికలకు ఇంకా 70 రోజులే ఉన్నాయన్న సీఎం జగన్.. ఈ 70 రోజుల్లోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారా? లేదా? ఎన్నికల తరువాత పరీక్షలు నిర్వహిస్తారా? అనే గందరగోళంలో ఏపీ నిరుద్యోగులు ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పిఆర్సీకి రిపోర్ట్ వచ్చే లోపు ఐఆర్ పై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.

Also Read : ఏపీలోనూ బీహార్ మార్క్ రాజకీయం.. బీజేపీ గేమ్ ప్లాన్ ఇదేనా?

రైతు రుణమాఫీ..

ఎన్నికల ముందు ఏపీలోని రైతు సోదరులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారికి భారంగా పడిన పంట రుణాలను మాఫీ(Rythu Runa Mafi) చేయాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం. ఈ నెల 31న జరిగే కేబినెట్ భేటీలో రుణమాఫీ విధి విధానాలపై కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది జరిగితే రాష్ట్రంలోని రైతుల ఓట్లన్నీ వైసీపీ ప్రభుత్వానికి పడుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే దారిలో కూడా సీఎం జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ నుంచి కాపీ..

తెలంగాణలో కాంగ్రెస్(T Congress) ప్రభుత్వం అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి మంచి ఆధారణ లభిస్తుండడంతో.. అదే పథకాన్ని ఏపీ(AP) లో కూడా అమలు చేయాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలు చేయడం ద్వారా మహిళల ఓట్లు తమకు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనిపై తుది నిర్ణయాన్ని ఈ నెల 31న జరిగే కేబినెట్ భేటీ తరువాత ఏపీ సర్కార్ ప్రకటించనుంది. అలాగే.. వచ్చే ఎన్నికలకు సంబంధించి కొత్త మేనిఫెస్టో అంశం పైన కూడా రాష్ట్ర మంత్రి వర్గం చర్చించనుంది.

Also Read : రాహుల్‌ గాంధీ డూప్‌ వివరాలను త్వరలోనే బయటపెడతాను: అస్సాం సీఎం!

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు