AP Assembly Sessions:ఆంధ్రాలో అసెంబ్లీ సమావేశామొదలయ్యాయి. ఈరోజు నుంచి వరుసగా సమావేవాలు జరగనున్నాయి. మొదట గవర్నర్ ప్రసంగిస్తున్నారు. తర్వాత ఇరు సభలూ వాయిదా పడనున్నాయి. సభల వాయిదా అనంతరం బీఎస్సీ సమావేశం జరగనుంది. దీనిలో ఎన్ని రోజులు సభలు నిర్వహించాలని దానిపై చర్చ చేయనున్నారు. ఇక రేపు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానం చేస్తారు. ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎల్లుండి ఉదయం 11 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారని సమాచారం. ఏపీలో కూడా త్వరలో ఎన్నికలు జరగనుండడంతో ఇక్కడి ప్రభుత్వం ఓటాన్ ఎకౌంటు బడ్జెట్ పెడగారని చెబుతున్నారు.
Also Read:Cat : ఐదు రోజులుగా తిండి లేక.. పిల్లిని పీక్కుతిన్న యువకుడు
అసంతృప్త ఎమ్మెల్యేల దారెటు...
మరో వైపు అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేల హాజరు పై ఉత్కంఠత ఏర్పడుతోంది. అభ్యర్థుల మార్పుల వ్యవహారంతో అధిష్టానం మీద వైసీపీ ఎమ్మెల్యేలు సీరియస్‌గా ఉన్నారు. దాంతో పాటూ సీటు రాని ఎమ్మెల్యేలు సభకు హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే పార్థసారథి, ఆదిమూలం టిడిపికి మద్దతు తెలిపారు. ఇక కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి గుడ్ బాయ్ చెప్పారు. ఇప్పుడు వీరు అసెంబ్లీకి వస్తే ప్రభుత్వం పక్కన కూర్చుంటారా.. లేక అసమ్మతి వర్గం వైపు కూర్చుంటారా అనే సందేహంగా మారింది. సీటు రాని అసంతృప్త ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
Also Read:Gold Rates News: బంగారం కొనాలంటే మంచి ఛాన్స్.. నిలకడగా ధరలు.. ఎంతంటే..