ఎన్టీఆర్ తో సీరియల్ నటి రొమాన్స్.. ఆమె గ్లామర్ చూస్తే కుర్రాళ్లు క్లీన్ బౌల్డే

ఎన్టీఆర్‌, కొరటాల మూవీ 'దేవర'నుంచి మరో అప్ డేట్ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీతో జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుండగా తాజాగా ఈ సినిమాలో కన్నడ భామ, టెలివిజన్ నటి ‘గుప్పెడంత మనసు' ఫేమ్ జ్యోతి రాయ్ ఓ కీ రోల్ పోషించబోతున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ తో సీరియల్ నటి రొమాన్స్.. ఆమె గ్లామర్ చూస్తే కుర్రాళ్లు క్లీన్ బౌల్డే
New Update

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘దేవర’ నుంచి మరో సాలిడ్ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ మూవీలో శ్రీదేవి చిన్న కూతురు, నటి జాన్వీకపూర్ తెలుగు ఇండ‌స్ట్రీకి పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ మూవీలోకి మరో నటి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ టెలివిజన్ నటికి కూడా ఇదే సినిమా అరంగేట్రం కావడం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది.

publive-image

Also read : మీ రిలేషన్ బోర్ కొడుతోందా.. మళ్లీ కొత్తగా ఆశ్వాదించాలంటే ఇలా చేయండి

ఈ మేరకు తీర ప్రాంతం కథ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్లు మేక‌ర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగానే 2024 ఏప్రిల్ 5న ఫస్ట్ పార్ట్ విడుద‌ల కానుండగా అప్పుడే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ మూవీనుంచి తార‌క్ లుక్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ లుక్‌ల‌ను రిలీజ్ చేశారు. ఈ పిక్స్ ఫ్యాన్స్ ను తెగ అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీరియల్​ నటి ‘గుప్పెడంత మనసు'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ భామ జ్యోతి రాయ్​ ‘దేవర’ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని మేక‌ర్స్ అధికారికంగా ప్రకటించలేదు కానీ.. రీసెంట్‌గా జ్యోతిరాయ్ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లతో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని పరోక్షంగా బయటపెట్టింది. దీంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది. జ్యోతిరాయ్ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతారంటూ పలువురుకామెంట్స్ చేస్తున్నారు.

publive-image

ఇదిలావుంటే.. 'దేవర టీజ‌ర్‌ను డిసెంబ‌ర్ 22న విడుద‌ల చేయ‌నున్నట్లు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబ‌ర్ 22న రెండు పాన్ ఇండియా సినిమాలు సలార్, డంకీ విడుద‌ల అవుతున్న విష‌యం తెలిసిందే. అదేరోజున ఈ సినిమాల‌తో దేవర టీజ‌ర్‌ను థియేటర్స్‌లో విడుద‌ల చేయ‌నున్నట్లు స‌మాచారం.

#jyothi-rai #koratala-shiva #devara #ntr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి