Tirumala: తిరుమలలో మరో చిరుత కదలికలు.. కొనసాగుతున్న ఆపరేషన్ ఓ వైపు చిరుతలు.. మరోవైపు ఎలుగుబంటి హల్ చల్.. కొండపైకి వెళ్లాలంటేనే ప్రాణాలకు తెగించి వెళ్లాలి. లేదంటే ప్రాణాలు వన్య మృగాల చేతిలో బలి అవ్వాల్సిందే.. దేవుని దర్శనం కావాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే అంటున్నారు భక్తులు. . ఇది తిరుమలలో కొనసాగుతున్న పరిస్థితి. By Vijaya Nimma 16 Aug 2023 in అనంతపురం తిరుపతి New Update షేర్ చేయండి Cheetah in Tirumala: తిరుమల శేషాచల కొండల్లో గత కొద్ది రోజులుగా వన్య మృగాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తిరుమల కాలినడక మార్గంలో వెళ్తున్న భక్తులను చిరుతలు.. ఎలుగుబంటి తరచు హల్‌చల్ చేస్తూ భయానికి గురి చేస్తున్నాయి. ఓ ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంటున్నాయి. తాజా చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. ఆ ఘటన తిరుమలలో కలకలం సృష్టించింది. దీంతో టీటీడీ అప్రమత్తం అయింది. దాదాపు 25-30 చిరుతలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్న టైంలోనే ఎలుగుబంటి కనిపించటంతో కలకలంగా మారింది. కాలినడకన మార్గంలో వెళ్తున్న భక్తుల కోసం టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో బాలిక లక్షిత మృతితో టీటీడీ భక్తుల భద్రతపై అప్రమత్తమైయ్యారు అధికారులు. భక్తుల భద్రతపై ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్న టీటీడీ మరోవైపు.. తిరుమలలో చిరుతల వేట కొనసాగిస్తున్నారు. ఈ చిరుతల కోసం శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి తిరుమలకు ప్రత్యేక బృందాలను పిలిపించారు. తిరుమలకు నడకదారిలో జంతువుల సంచారం కోసం 400 కెమెరాలు ఏర్పాటు చేశారు. 40 మందితో కూడిన నిపుణుల బృందం కెమెరాలు ఏర్పాటు చేసింది. అలాగే..వివిధ ప్రాంతాల్లో చిరుతల కోసం బోన్లు కూడా ఏర్పాటు చేశారు. మోకాళ్ల మెట్టు, 36వ మలుపు వద్ద బోన్లును అమర్చినట్లు తెలిపారు. అంతేకాకుండా నడకదారిలో అదనపు ఎల్‌ఈడీ లైటను అధికారులు ఏర్పాటు చేశారు. త్వరగా సమస్యను పరిష్కరించండి జూన్‌లో ఓ బాలుడిపై చిరుత దాడి చేయగా అతను తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వన్యప్రాణుల నుంచి భక్తుల రక్షణ కోసమంటూ తిరుమల అధికారులు పలు నిర్ణయాలు ప్రకటించినా అవేవీ అమలకు నోచుకోలేదు. తాజాగా ఆరేళ్ల బాలిక చిరుత దాడికి బలైపోయింది. మొదటి ఘటన జరిగినప్పుడే అప్రమత్తమై ఉంటే..! ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకొని ఉంటే..? ఇప్పుడు చిన్నారి ప్రాణాలు పోయేవి కాదని భక్తులు అంటున్నారు. టీటీడీ తలచుకుంటే ఎంత పెద్ద సమస్య అయిన పరిష్కారానికి నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోని అవి అమలయ్యేలా చేయడం పెద్ద పనేమీ కాదంటున్నారు ప్రజలు. వరుస ఘటనలు జరుగుతున్నా పాలకమండలి ఏం చేస్తోందని ప్రశ్నింస్తున్నారు. కొత్త ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అటవీ సిబ్బందిని నియమిస్తామని చెబుతున్నారు కానీ.. ఈ నియామక ప్రక్రియ పూర్తి అవుతుందా? అనే సందేహం జనాల్లో ఎక్కువైంది. Also Read: వాట్సాప్ యూజర్లకు బంపర్ న్యూస్.. త్వరలోనే ఏఐ స్టిక్కర్లు! #tirumala #bear #leopard-in-tirumala #cheetah-in-tirumala #cheerutha-movement #tirumala-footpath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి