WhatsApp: వాట్సాప్ యూజర్లకు బంపర్ న్యూస్.. త్వరలోనే ఏఐ స్టిక్కర్లు! వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ జపం చేస్తుండడంతో వినియోగదారులకు 'ఏఐ' స్టిక్కర్ ట్రీట్ ఇవ్వనుంది. 'ఏఐ'తో స్టిక్కర్‌లను అందించడమే ఈ ఫీచర్ స్పెషాలిటీ. ప్రస్తుతానికి చాలా తక్కువ మందికి మాత్రమే రిలీజ్ అయిన ఈ స్పెసిఫికేషన్.. త్వరలోనే మరింత మందికి అందుబాటులోకి రానుంది. By Trinath 16 Aug 2023 in టాప్ స్టోరీస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి WhatsApp introduces beta update with AI generated stickers: టెక్ట్స్(Text) ఛాటింగ్ చేయడం బోర్.. ఎమోజీలతో మెసేజులు చేస్తే ఆ ఆనందం వేరు. వంద మాటల భావాలను ఒక్క ఎమోజీ చూపిస్తుంది. ప్రేమ వ్యక్తం చేయడానికైనా.. కోపం చూపించడానికైనా ఎమోజీ చాలు. ఇక ఎమోజీలతో పాటు వాట్సాప్‌లో స్టిక్కర్లను ఎక్కువగా ఉపయోగించేవారు కూడా ఉంటారు. స్టిక్కర్లను సెండ్ చేయడానికి ఇష్టపడతారు. ఆ స్టిక్కర్లకు టెక్ట్స్ ను జోడించి మెసేజ్ చేస్తే ఆ కిక్కే వేరు. ఇప్పటివరకు ఇలాంటి స్టిక్కర్లు ఎన్నో అందుబాటులో ఉన్నా త్వరలో రానున్న స్టిక్కర్లు యూజర్లను మరింత థ్రిల్ చేయనున్నాయి. ఇప్పుడంతా ఏఐ మాయ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(artificial intelligence) ఎంట్రీతో ప్రపంచం మారుతోంది. అప్పట్లో కంప్యూటర్ల ఎంట్రీ తర్వాత ఎలాగైతే ప్రపంచం కొత్త పుంతలు తొక్కిందో ఇప్పుడు ఏఐ రాక తర్వాత అదే పరిస్థితి కనిపిస్తుంది. స్కూల్ పిల్లల నుంచి బడా కంపెనీల వరకు 'ఏఐ'ని ఉపయోగిస్తున్నాయి. అదే సమయంలో తమ వినియోగదారులను మరింత ఆకర్షించేందుకు ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్‌లు కూడా 'ఏఐ'ని వాడుకోవాలని డిసైడ్ అయ్యాయి. యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్‌తో ఫ్రెష్ ఫీలింగ్ కలిగించే వాట్సాప్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించుకోవాలనుకుంటోంది. ఏఐ జనరేటెడ్ స్టిక్కర్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ టెస్టులు జరుగుతున్నాయి. అదిరే ఫీచర్ బాసూ: ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉండగా.. ఈ స్టిక్కర్‌లను రూపొందించడానికి ఒక బటన్ అందుబాటులో ఉంటుంది. కొత్త AI పవర్డ్ ఫీచర్‌ని ఉపయోగించి రూపొందించిన స్టిక్కర్‌లు రిసీవర్ ఈజీగా గుర్తించవచ్చు. ఇది మైక్రోసాఫ్ట్ చిత్రాలకు జోడించే బింగ్(Bing) లేబుల్ లేదా మరేదైనా వాటర్‌మార్క్ కావచ్చు. ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ విషయంపై క్లారిటీ వస్తుంది. మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా అనేక ప్రాజెక్ట్‌లపై దృష్టి సారిస్తూనే, కంపెనీ వాట్సాప్‌లో కొత్త AI ఫీచర్‌ను తీసుకురావాలని భావిస్తోన్నట్టు సమాచారం. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా ప్రోగ్రామ్‌లోని కొంతమంది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది కూడా. ఏఐ సాయంతో వాట్సాప్‌లోనే ఈజీగా స్టిక్కర్లు క్రియేట్ చేసుకునే ఫెసిలిటీ కల్పిస్తుండడం పట్ల యూజర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. #artificial-intelligence #whatsapp #whatsapp-features #ai మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి