మరోసారి చిరుత కలకలం.. తిరుమలలో భక్తుల ఆందోళన
తిరుమలలో చిరుత సంచారం మరోసారి భక్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తుందన్న సమాచారంతో దర్శనానికి వెళ్తున్న భక్తుల్లో కలవరం మొదలైంది. చిరుత సంచారం నేపథ్యంలో టీటీడీ అధికారులు అలర్టయ్యారు.