Malla Reddy: కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ ఎంపీ.. మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్

త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎంపీ వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. చేవెళ్ల కాంగ్రెస్‌ టికెట్‌ కోసం రంజిత్‌రెడ్డి కర్చీఫ్‌ వేస్తున్నారని ఆరోపణలు చేశారు. రంజిత్‌రెడ్డి ప్రయత్నాలు తెలిసి పట్నం మహేందర్‌ రెడ్డి అలర్ట్‌ అయ్యారని అన్నారు.

New Update
Malla Reddy: కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ ఎంపీ.. మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్

Malla Reddy: మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కంటే ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. గత కొన్ని రోజులుగా మల్లారెడ్డి కేసీఆర్ (KCR) నడుపుతున్న కారు దిగి హస్తం గూటిలో చేరుతారని ప్రచారం జోరందుకుంది. ఈ వార్తలు రావడానికి కారణం గతంలో మల్లారెడ్డి పార్టీలు మారడమే అని అంటున్నారు రాజకీయ నిపుణులు. మల్లారెడ్డి పార్టీ మారడం ఏమో కానీ తాజాగా బీఆర్ఎస్ పార్టీని (BRS Party) దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారు.

ALSO READ: సీఎం రేవంత్ రెడ్డికి షాక్.. సుప్రీం కోర్టు నోటీసులు

కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎంపీ..

త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి (Congress Party) బీఆర్ఎస్ ఎంపీ (BRS MP) వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. చేవెళ్ల కాంగ్రెస్‌ టికెట్‌ కోసం రంజిత్‌రెడ్డి (MP Ranjith Reddy) కర్చీఫ్‌ వేస్తున్నారని ఆరోపణలు చేశారు. రంజిత్‌రెడ్డి ప్రయత్నాలు తెలిసి పట్నం మహేందర్‌ రెడ్డి అలర్ట్‌ అయ్యారని అన్నారు. చేవెళ్ల ఎంపీ టికెట్‌ కోసమే మహేందర్‌రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ని కలిశారని ఊహించాని ట్విస్ట్ ఇచ్చారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరిగేది తెలియదని అన్నారు. ఎవరు ఏ పార్టీలోకైన వెళ్ళవచ్చు అని పేర్కొన్నారు. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రంజిత్ రెడ్డి ఇంకా స్పందించకపోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో అనేక చర్చలకు దారి తీస్తోంది.

కేసీఆర్ కు షాకులు తప్పేనా?

బీఆర్ఎస్(BRS) పార్టీకీ వరుస షాక్ లు తగులుతున్నాయి. కేసీఆర్(KCR) గవర్నమెంట్ లో కొంతకాలం కీలకంగా పనిచేసిన నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా(Baba Fasiuddin) ఫసీయుద్దీన్ రాజీనామా చేయగా.. తాగాజా పట్నం ఫ్యామిలీ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసింది.

రేవంత్‌రెడ్డితో భేటీ..

ఈ మేరకు మహేందర్‌రెడ్డి(Mahender Reddy) తో పాటు తమ అనుచరులంతా వారం రోజుల్లో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందులోభాగంగానే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి, వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డి(Sunitha) గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.

ఢీల్లీ లేదా హైదరాబాద్‌ వేదికగా..

ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ.. ఢీల్లీ(Delhi) లేదా హైదరాబాద్‌(Hyderabad) వేదికగా పార్టీలో చేరాలా, జిల్లాలో బహిరంగ సభ నిర్వహించి చేరాలా అనే విషయమై చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దామోదర్‌ రాజనర్సింహ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి కుమారుడు రినీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

DO WATCH:

Advertisment
తాజా కథనాలు