RCB : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli), భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) మధ్య వివాదం ముదురుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గత నెల 25న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కొహ్లీ 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. 118.60 స్ట్రైక్ రేట్‌తో ఆడటం వల్ల అతను విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇన్సింగ్స్ స్లోగా ఆడాడని.. కేవలం సింగిల్స్‌కే పరిమితమయ్యాడని సునీల్ గవస్కార్ కూడా కామెంట్ చేశాడు.
Also read: ఆసక్తి కరంగా మారిన ఐపీఎల్ ప్లేఆఫ్ రేస్..
దీంతో కొహ్లీ గవాస్కర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లో పరిస్థితులు తెలుసుకోకుండా.. కామెంటేటర్ బాక్స్‌లో కూర్చొని మాట్లడటం సరికాదన్నాడు. అయితే శనీవారం గుజరాత్, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు కోహ్లీ తనపై చేసిన కామెంట్స్‌పై సునీల్ గవస్కార్ స్పందించాడు. అలాంటి వ్యాఖ్యలు చేయడం.. విశ్లేషకులుగా పనిచేస్తున్న మాజీ క్రికెటర్లను అవమానించమేనని అన్నారు. 'బయటి నుంచి వచ్చే కామెంట్లను మేము పట్టించుకోమని చెబుతుంటారు. మరెందుకు సమాధానమిస్తున్నారంటూ మండిపడ్డారు.
మేము బాగా క్రికెట్(Cricket) ఆడకపోయిన కొంతవరకు ఆడాం. మాకు ఎజెండాలు లేవు. ఏం చూస్తామో దాని గురించే మాట్లాడుతాం. కచ్చితమైన ఇష్టాలు, అయిష్టాలు అనేవి ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా ఏం జరిగిందో అదే మాట్లాడుతాంమని' గవస్కార్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు స్టార్ స్పోర్ట్స్ కూడా.. కొహ్లీకి సంబంధించిన క్లిప్‌ను పదేపదే టీవీలో ప్రసారం చేయడంపై కూడా గవస్కార్ విమర్శలు చేశారు. అయితే గవస్కార్.. చేసిన వ్యాఖ్యలపై విరాట్ కొహ్లీ ఇంతవరకు స్పందించలేదు.
Also Read: ఏపీలో అధికారం ఎవరిదో చెప్పేసిన RTV.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?