Roja: మహిళలను తిడితే తాట తీస్తానన్న పవన్ కల్యాణ్‌ ఎక్కడ ?.. RTVతో రోజా సంచలన ఇంటర్వ్యూ

మాజీ మంత్రి రోజాపై ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్‌ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలకు, మీ పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ రోజా ఆయనపై మండిపడ్డారు. మహిళలను తిడితే తాట తీస్తానన్న పవన్ కల్యాణ్‌ ఎక్కడని ప్రశ్నించారు.

New Update

మాజీ మంత్రి రోజాపై ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్‌ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన రోజా ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు, మీ పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడ్డారు. RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. రాజకీయాల కోసం మరీ ఇంతగా దిగజారాలా అంటూ ప్రకాశ్‌ రాజ్‌పై ధ్వజమెత్తారు. మహిళలను తిడితే తాట తీస్తానన్న పవన్ కల్యాణ్‌ ఎక్కడ అని ప్రశ్నించారు. 

Also Read: CRPF జవాన్‌ను చితకబాదిన శివ భక్తులు.. వీడియో వైరల్

ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం విఫలమైందని రోజా విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నరకం చూపిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అవినీతి చేసేందుకు కూటమి నేతలు పోటీ పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: లిక్కర్ స్కామ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి.. రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు

ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో  రోజా, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మధ్య వార్ నడుస్తోంది. ఇసుక, బియ్యం స్మగ్లింగ్‌తో రోజాతో పాటు ఆమె సోదరులకు, భర్తకు సంబంధం లేదని కాణిపాకం గుడికి వచ్చి ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సవాల్‌ విసిరారు. రూ.12 వేల అద్దె ఇంటినుంచి ఇప్పుడు ఊరికో ఇంటిని నిర్మించుకునే స్థాయికి రోజా ఎదిగిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే రోజా గాలి భాను ప్రకాశ్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు