ఏపీలో ఊహించని రాజకీయ పరిణామం.. రాజీకీ వచ్చిన జగన్, షర్మిల !

జగన్‌, షర్మిలకు మధ్య గత కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఆస్తిలో షర్మిలకు ఏమీ ఇచ్చేది లేదని అనుకున్న జగన్.. ఇప్పుడు ఆస్తి పంపకాలకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. బెంగళూరులో దీనిపై చర్చలు జరిగినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి

Jagan and sharmila
New Update

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమతమైన వైసీపీకి కోలుకోలేని దెబ్బ పడింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండోసారి కూడా అధికారం తమదే అనే ఓవర్‌కాన్ఫిడెన్స్‌తో ఉన్న జగన్.. అధికారం పోయిన తర్వాత వాస్తవాలను తెలుసుకనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సోదరి షర్మిలతో వివాదం మంచిదికాదని... ఎన్నికలకు ముందు జగన్‌కు సన్నిహితులు చెప్పారు. కానీ జగన్ మాత్రం వీరిని పట్టించుకోలేదు. అయితే ఎన్నికల తర్వాత జగన్ తన వైఖరిని మార్చుకుంటున్నట్లు సమాచారం. 

ఆస్తి పంపకాలకు ఓకే 

జగన్‌కు, షర్మిలకు మధ్య గత కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఆస్తిలో షర్మిలకు ఏమీ ఇచ్చేది లేదని అనుకున్న జగన్.. ఇప్పుడు ఆస్తి పంపకాలకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. బెంగళూరులోనే వీటికి సంబంధించిన చర్చలు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఒంటరిగా ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్న జగన్.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ను కలుపుకొని పోయే యోచనలో ఉన్నారనే ప్రచారాలు జరుగుతున్నాయి. 

Also Read: వైసీపీ మాజీ మంత్రికి బిగ్ షాక్.. హత్య కేసులో కుమారుడి అరెస్ట్!

ఒంటరిగా కష్టమే

ప్రస్తుతం ఏపీసీసీ చీఫ్‌గా షర్మిల కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా జగన్‌ను షర్మిల వ్యతిరేకిస్తునే ఉంది. వారిద్దరి మధ్య ఆస్తి పంపకాలు వివాదమే దీనికి కారణమనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పుడు ఆస్తి పంపకాలకు జగన్‌ ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైసీపీతో జతకట్టేందుకు షర్మిల వ్యతిరేకించపోవచ్చని తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసుకుంటే కాంగ్రెస్, వైసీపీ ఒంటరిగా రాజకీయంగా పుంజుకోవడం కష్టమని పలువురు విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌తో కలిస్తే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వైసీపీ భావిస్తుండగా.. మరోవైపు వైసీపీతో కలిస్తే ఏపీలో తమ పార్టీ బలపడేందుకు అవకాశం దొరుకుతుందని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్‌తో కలవాలంటే షర్మిలతో ఉన్న వివాదాన్ని తెగదెంపులు చేసుకోవాలని అధిష్ఠానం పెద్దలు చెప్పడంతోనే జగన్ ఆస్తుల పంపకంపై సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో జగన్ బెంగళూరుకు ఎక్కువగా వెళ్తున్నారు. షర్మిలతో వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకే ఆయన అక్కడ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రెండు అంశాల్లో తప్పా ఆస్తుల అంశాల్లో ఇద్దరి మధ్య రాజీ కుదిరినట్లు సమాచారం. కర్ణాటక డిప్యూటీ సీఎం డేకే శివకుమార్ అన్నాచెల్లె మధ్య రాజీ కుదిర్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. ఆ రూట్లో 4 లైన్ల హైవే.. ఇక సాఫీగా జర్నీ

ఆర్థికపరమైన వివాదాలకు ముగింపు పలకాలని జగన్, షర్మిల ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ,జనసేన ఎన్డీయే కూటమిలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో జగన్ ఇండియా కూటమి వైపు వెళ్తారనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విపక్ష జాతీయ పార్టీతో జట్టు కడితేనే రాష్ట్రంలో రాజకీయంగా బలపడవచ్చొని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 2027లో జమిలీ ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు ఉన్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ, కాంగ్రెస్ కలిసి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి త్వరలో ఏపీలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే.

#congress #jagan #sharmila #andhrapradesh #ysrcp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe