/rtv/media/media_files/2025/06/22/jagan-sattenapalli-2025-06-22-11-33-33.jpg)
జగన్ సత్తెనపల్లి మండల పర్యటనలో సింగయ్య మృతికి సంబంధించి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెంటపాళ్ల గ్రామం వద్ద జగన్ కారు కింద పడి చీలి సింగయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. కారు కింద వృద్ధుడు పడినట్లు స్థానికులు అరిచినా పట్టించుకోకుండా వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా జగన్ కారు ముందుకు వచ్చారు. సింగయ్య కారు ముందు టైర్ కింద పడిపోయారు. డ్రైవర్ చూసుకోకుండా ముందుకు నడిపాడు.
ఈనెల 18వ తేదీన సత్తెనపల్లి జగన్ పర్యటన నేపథ్యంలో జగన్ కారు కింద పడిపోయే చనిపోయిన సింగయ్య వీడియో వైరల్..
— RTV (@RTVnewsnetwork) June 22, 2025
సింగయ్య జగన్ కాన్వాయ్ లోని వాహనం గుద్ది చనిపోయాడని భావించిన పోలీసులు..
తాజాగా వీడియో వెలుగులోకి రావడంతో... విచారణ చేపట్టిన పోలీసులు..
ఆరోజు సింగయ్య తో పాటు వచ్చిన గ్రామ… pic.twitter.com/TfqrKp3ncX
సింగయ్య మృతిపై గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పందించారు. సింగయ్య కుటుంబం కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సింగయ్యను ఓ ప్రైవేట్ వెహికల్ AP 26 CE 0001 అనే టాటా సఫారీ తొక్కుకుంటూ వెళ్ళిపోయింది.