YS Jagan : చంద్రబాబుతో  చేతులు కలిపిన స్పీకర్ తలదించుకోవాలి : జగన్

ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము గతంలో పేదలకు మంచి చేస్తే.. ఈరోజు చంద్రబాబు మాత్రం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు

New Update
jagan

ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ చీఫ్, మాజీ సీఎం జగన్(YS Jagan) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము గతంలో పేదలకు మంచి చేస్తే.. ఈరోజు చంద్రబాబు(chandrababu) మాత్రం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో మంజూరైన, పనులు ప్రారంభించిన నర్సీపట్నం మెడికల్ కాలేజీని జగన్ ఈ రోజు సందర్శించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామన్నారు.  ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువ ఛార్జీ చేస్తే.. తట్టుకోవడం పేదవాళ్లకు అసాధ్యమని,  అందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. అలాంటి ఆధునిక దేవాలయాలను ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారని జగన్ ప్రశ్నించారు. అంతా ప్రైవేట్ పరం చేస్తే పేదవారికి వైద్యం ఎలా అని నిలదీశారు. పేదవాళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చామన్న జగన్.. నర్సీపట్నంలో 52 ఎకరాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టామని చెప్పారు. కోవిడ్ సంక్షోభంలోనూ రూ.500కోట్లు ఖర్చు చేశామని,   ఈ మెడికల్ కాలేజీలో పూర్తయితే 600 బెడ్లతో పేదలకు ఉచిత వైద్యం అందేదని తెలిపారు.  ఏడాదికి 150 మెడికల్ కాలేజీ సీట్లను అందుబాటులోకి తెచ్చామని,  అలాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే పేదవారికి వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. 

Also Read :  మోహన్‌బాబుకు బిగ్‌ షాక్‌... విశ్వవిద్యాలయానికి భారీ జరిమానా

అయ్యన్నపాత్రుడుకి వైఎస్ జగన్ కౌంటర్!

రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని జగన్ అన్నారు. నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నేత, ఎమ్మెల్యే, స్పీకర్ చంద్రబాబులా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  అబద్ధాలు చెబుతూ.. తాను కూడా చంద్రబాబు కంటే నాలుగు ఆకులే ఎక్కువే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. రుజువు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  దీన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబుకు బుద్ధిరావాలి' అని యాజిటేషన్ కార్యక్రమం చేస్తున్నామని జగన్ అన్నారు. ఇదే నర్సీపట్నం నేత, స్పీకర్ కు  చెబుతున్నాను.. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నామని అన్నారు.  ఈమెడికల్ కాలేజీలకు జీవో ఎక్కడుందని అడుగుతారా?.. ఇదిగో జీవో నెంబర్ 204..  స్పీకర్ పదవిలో ఉండి జీవో నెంబర్ 204 లేదని అబద్ధాలు చెప్పినందుకు మీ పదవికి మీరు అర్హులేనా? అని ఆలోచన చేయండని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబుతో  చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తలదించుకోవాలన్నారు జగన్.  

అమరావతికి మొత్తంగా లక్ష ఎకరాలు.. రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతూ.. 70 వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచాం అని చెప్పుకుంటున్నారని జగన్ మండిపడ్డారు.. కోట్లాది మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు, ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు..ఏడాదికి వెయ్యికోట్లు ఐదేళ్లకు ఐదువేల కోట్లు ఖర్చు పెట్టలేక.. ప్రైవేట్ పరం చేస్తున్నారా అని సీఎం చంద్రబాబును జగన్ ప్రశ్నించారు.  

Also Read :  నెల్లూరులో జంట హత్యలు.. రంగంలోకి పోలీసు జాగిలాలు

Advertisment
తాజా కథనాలు