జగన్‌కు చంద్రబాబు మరో బిగ్ షాక్.. TDPలో చేరిన కుప్పం కీలక నేత!

చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అమరావతిలో చంద్రబాబును కలిసి టీడీపీలో చేరారు.

Chandrababu Kuppam TDP YCP
New Update

చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అమరావతిలో చంద్రబాబును కలిసి టీడీపీలో చేరారు. సుధీర్ కు పసుపు కండువా కప్పి చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌ పదవులకు సుధీర్ రాజీనామా చేశారు. గత జగన్ సర్కార్ చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2021 నవంబర్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కుప్పంను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేశారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబు ప్లాన్ అదుర్స్..ఏపీకి నెదర్లాండ్స్ సిస్టమ్, వాటికి చెక్!

కుప్పం మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న వైసీపీ

దీంతో మొత్తం 25 కౌన్సిలర్ స్థానాలకు గానూ వైసీపీ 19 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఆ ఉత్సాహం టార్గెట్ కుప్పం అసెంబ్లీగా వైసీపీ పని చేసింది. వై నాట్ కుప్పం అని ఆ పార్టీ అధినేత జగన్ సైతం అనేక సార్లు మీటింగ్ లలో ప్రకటించారు. కుప్పం ఇన్ఛార్జి భరత్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Supreme Court: ప్రైవేట్ ఆస్తుల విషయంలో.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

చంద్రబాబు కంచుకోట అయిన కుప్పుంలో విజయం సాధించి సత్తా చాటాలని ప్రయత్నించింది. అయితే.. గత ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. కుప్పంలో చంద్రబాబు ఎనిమిదో సారి విజయం సాధించారు. చంద్రబాబు చేతిలో పరాజయం పాలైన భరత్ నియోజకవర్గంలో పెద్దగా కనిపించడం లేదు. ఇటీవల ఆయన కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదైంది. 

అయితే.. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కుప్పంతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే పుంగనూరు మున్సిపల్ చైర్మన్ టీడీపీ గూటికి వచ్చేలా వ్యూహాలు రచించింది. అనంతరం ఇప్పుడు కుప్పం మున్సిపల్ చైర్మన్ కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు. రానున్న రోజుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు ఉండే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

 

Also Read : ప్రైవేట్ ఆస్తుల విషయంలో.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

Also Read : మాజీ సీఎంపై కేసు నమోదు!

#chandrababu #jagan #kuppam #big-shock
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe