పెళ్లికాని ప్రసాద్‌లే టార్గెట్.. పెళ్లి చేసుకుని లక్షల్లో కన్నం!

పెళ్లి కాని యువకులే టార్గెట్‌గా కొన్ని ముఠాలు పెట్టుకున్నాయి. తాజాగా 40 ఏళ్ల రాయలసీమ వ్యక్తి భీమవరానికి చెందిన పేదింటి యువతిని రూ.4.5లక్షలు ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆ యువతి అక్కడ నుంచి పరారైంది.

matrimony style scam
New Update

సాధారణంగా కొన్ని సామాజిక వర్గాల్లో పెళ్లీడు ఆడపిల్లలు చాలా తక్కువగా ఉంటారు. దీంతో పెళ్లి కాని యువకులకు ఇదొక పెద్ద సమస్యగా మారింది. అవివాహిత యువకుల సంఖ్య క్రమక్రమంగా పెరగడంతో పెళ్లి సంబంధాలు దొరక్క విసిగిపోతున్నారు. ఈ కారణంగా దూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల పేదింటి అమ్మాయిలకు ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. 

ఇక ఇదే సరైన సమయంగా భావించిన కొందరు పెళ్లి కాని యువకుల నుంచి డబ్బు గుంజే ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం ఏకంగా ఓ ముఠానే పనిచేస్తుంది. ఎవరైతే పెళ్లికాని అబ్బాయిలు.. వయసు ఎక్కువ గల వారు, పేదింటి అమ్మాయికి ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటారో వారిని మభ్యపెట్టి పెళ్లి చేసినట్లు చేసి.. వారి నుంచి లక్షల్లో గుంజుకుని పరారవుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో చాలానే జరిగాయి. 

మోసపోయిన 40 ఏళ్ల వ్యక్తి

ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి ముఠాల వలలో పడి ఎంతో మంది లక్షలు పోగొట్టుకున్నారు. మరోవైపు రాయలసీమలోని హిందూపురానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఈ తరహా మోసంలో చిక్కుకున్నాడు. ఆ ప్రాంతంలో వధువల కోసం ఎంత వెతికినా దొరకకపోయే సరికి భీమవరంలో అగ్రవర్ణ పేదింటి యువతి ఉందని తెలుసుకున్నాడు. 

Also Read: సునీతా విలియమ్స్‌ ఆరోగ్యంపై ఆందోళనలు.. స్పందించిన ఆస్ట్రోనాట్

ఈ సమాచారాన్ని ఆ వ్యక్తికి మధ్యవర్తులు అందించారు. దీంతో ఆ వ్యక్తి భీమవరం చేరుకుని మధ్యవర్తులను కలిశాడు. ఈ తరుణంలోనే యువతి ఫ్యామిలీకి ఆర్థికంగా, అండగా నిలబడమని చెప్పి ఆ వ్యక్తి నుంచి రూ.4.5 లక్షలు గుంజేశారు. అనంతరం ఆ యువతిని పెళ్లి చేసుకుని తన సొంతూరికి తీసుకెళ్లాడు. 

Also Read: రగులుతున్న మణిపూర్...కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమీక్ష

అక్కడ నుంచి ఎప్పుడెప్పుడు జంప్‌ అవుదామా అని ఆ వధువు ప్లాన్‌లు వేసింది. ఇందులో భాగంగానే ఓ రోజు తన ఫ్యామిలీని చూడాలని చెప్పడంతో భర్త ఆమెను రైల్వేస్టేషన్‌కు తీసుకొచ్చాడు. అనంతరం ఆమె మాయ మాటలు చెప్పి అక్కడ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో అతడు మధ్యవర్తులను ఫోన్‌లో ఆరాతీయగా.. అదొక నకిలీ గ్యాంగ్ అని తెలుసుకున్నాడు. 

ఇదే తరహాలో ధర్మవరానికి చెందిన ఓ యువకుడు చిక్కుకొని రూ.3 లక్షలు మోసపోయాడు. అలాగే సత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సైతం రూ.8 లక్షలు పోగొట్టుకున్నారు. ముఖ్యంగా వెస్ట్ గోదావరి జిల్లాకి చెందిన ముఠాగా తెలుస్తోంది. సమీప ప్రాంతాల్లో ఉన్న కొందరు రిలేషన్ పేరుతో ఒక్కటవుతున్నారు. అక్కగా ఒకరు, బావగా మరొకరు, అమ్మ నాన్నగా ఇంకొకరు.. ఇలా సంబంధం పేరుతో ఒక్కటై ముఠాగా చేరి డబ్బులు గుంజుతున్నారు. 

Also Read: మహారాష్ట్రలో పవన్ ప్రచారం..తెలుగు, హిందీ, మహారాష్ట్రల్లో ప్రసంగం

#crime-news #crime #ap-crime #Fake Marriages
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe