/rtv/media/media_files/2025/02/03/PEvwkqZHRrXXZPZfD5AH.jpg)
Upendra Suspicious Death
Kurnool Crime: కర్నూల్‌లోని ఎమ్మిగనూరు మేకల బజారులో దారుణం జరిగింది. ఉపేంద్ర (23) అనే యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. అతని మొహం, కాళ్లపై తీవ్ర గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఉపేంద్రను హత్య చేశారంటూ అతని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారం కారణమా? ఇంకా ఏదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: కేసీఆర్ కు బిగ్ షాక్... లీగల్ నోటీసులు పంపిన లాయర్ ఎందుకో తెలుసా...
ఇదిలాఉండగా ఇటీవల అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం వాడపల్లిలో ఓ వ్యక్తిని మద్యం మత్తులో ముగ్గురు యువకులు దారుణంగా హతమార్చారు. వాడపల్లిలో చెరువులో చేపల దొంగతనానికి వెళ్లిన దుర్మార్గులు.. కాపాలాదారుడిని అతికిరాతకంగా తాటి గరికతో పీక కోసి, కర్రలతో కొట్టి చంపేశారు. రోజువారిలాగే వొంటుకుల చిన్నారెడ్డి (55) అనే వ్యక్తి చేపల చెరువు వద్ద కాపలా ఉన్నాడు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో చేపల దొంగతనానికి పాల్పడుతున్న యువకులను మందలించాడు. అయినప్పటికీ వారు వినకపోవడంతో ఆగ్రహానికి లోనై బెదిరించాడు. దీంతో విచక్షణ కోల్పోయిన ఆ ముగ్గురు చిన్నారెడ్డిపై దాడి చేశారు.
Also Read: ఎన్నికల కమిషనర్‌కు బీజేపీ ఆఫర్.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
మెడను కోసి, కర్రలతో కొట్టి..
దీంతో రక్షణ కోసం ఆయన వారిపై దాడిచేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే దుండగులు తాటి గరికలతో చిన్నారెడ్డి మెడను కోసి, కర్రలతో కొట్టి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు వాడిన గరిక, కర్రలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు యువకులు మారేడు మిల్లి మండలం వైదపూడి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మద్యం మత్తులో ఉన్నా నిందితులను పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేసినట్లు తెలిపారు.
.
Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్ కార్డు మార్చాలి.. స్టార్ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?