Big Breaking: జనవరిలో పంచాయతీ ఎన్నికలు..? యావత్తు తెలంగాణ ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలు జనవరిలో నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. డిసెంబర్ చివరి వారంలోనే షెడ్యూల్ విడుదల చేసి.. జనవరి 7వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చే చాన్స్ ఉన్నట్లు సమాచారం. By Bhavana 19 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి Telangana: ఎప్పుడెప్పుడా అని తెలంగాణ మొత్తం ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలు జనవరిలో నిర్వహించే అవకాశాలున్నాయని సమాచారం. డిసెంబర్ చివరి వారంలోనే షెడ్యూల్ విడుదల చేసి.. జనవరి 7వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చే సూచనలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. పంచాయతీ ఎన్నికలను ఈ సారి మూడు దశల్లో నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. Also Read: AP: ఆ మూడు పదాలు తొలగింపు.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జనవరి 21వ తేదీన తొలి దశ, జనవరి 25వ తేదీన రెండో దశ, జనవరి 30వ తేదీన మూడో దశలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి అధికారులు కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్ పూర్తయ్యాక ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో పంచాయతీలు, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు నడుస్తున్నట్లు తెలిసింది. Also Read: Sabarimala: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం! పోటీకి అర్హతలు ఇవే.. - సర్పంచ్/వార్డుకు పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరి కంటే ఎక్కువమంది సంతానం ఉంటే పోటీకి పనికిరారు - 1995 జూన్ 1 తర్వాత మూడో సంతానం ఉండరాదు. - ఒక కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు పుడితే వారు పోటీలో పాల్గొనవచ్చు. - పోటీకి కనీస వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. - పోటీ చేసే అభ్యర్థి గ్రామ పంచాయతీలో ఓటరుగా నమోదై ఉండాలి. - వార్డు మెంబర్/సర్పంచ్‌కు ప్రతిపాదకుడు అదే వార్డు/గ్రామంలో ఓటరు అయి ఉండాలి. - స్థానిక సంస్థల్లోని ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పోటీ చేయరాదు. దేవాదాయ సెక్షన్ 15 ప్రకారం ఏర్పాటుచేసిన సంస్థల్లోనివారు పోటీకి అనర్హులు. - ప్రభుత్వం ద్వారా 25 శాతానికి మించి పెట్టుబడి కలిగిన సంస్థలు/కంపెనీల మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్లు, సెక్రటరీలు పోటీ చేయరాదు. ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి ధ్రువీకరణను నామినేషన్ల పరిశీలనలోపు ఇస్తే వారు అర్హులే. Also Read: AP: ఏపీలో ఆ ఉద్యోగులందరూ తొలగింపు..సర్కార్ కీలక నిర్ణయం! Also Read: Delhi: ఇంకా రాజధానిగా ఢిల్లీ అవసరమా..? #telangana #panchayat-elections #panchayat election schedule మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి